Liquor Scam : విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు
Liquor Scam : ఈ నెల 18న విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హాజరై విచారణకు సహకరించాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.
- Author : Sudheer
Date : 15-04-2025 - 2:13 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం (Liquor Scam) కేసు రోజురోజుకీ సంచలనంగా మారుతుంది. తాజాగా ఈ కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి(Vijayasai Reddy)కి రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హాజరై విచారణకు సహకరించాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం కొనుగోళ్లలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది.
Natural Star Nani : ఫ్యాన్స్ కు నాని స్వీట్ వార్నింగ్
సిట్ ఇప్పటికే మద్యం కుంభకోణంపై సుదీర్ఘంగా దర్యాప్తు చేపట్టింది. ఇందులో పలువురు కీలక నేతలు, అధికారులు ప్రమేయం ఉన్నట్లు అంచనా వేస్తూ వివిధ దశల్లో విచారణను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి పేరు బయట పడడం, ఆయనను విచారణకు పిలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. విజయసాయిరెడ్డి పై ఆరోపణల నేపథ్యంలో వైసీపీ వర్గం దీనిని రాజకీయ వేధింపులుగా అభివర్ణించగలదని విశ్లేషకుల అభిప్రాయం.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పలు కీలక వ్యవహారాల్లో దర్యాప్తు ప్రారంభించింది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్‌లో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసుకు ప్రాధాన్యతనిచ్చింది. రాజకీయంగా సంచలనం రేపుతున్న ఈ విచారణలో ముందుజాగ్రత్త చర్యలుగా మరిన్ని నేతలకు కూడా నోటీసులు అందే అవకాశం ఉందని సమాచారం. విజయసాయిరెడ్డి విచారణలో ఏమి వెల్లడిస్తారన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.