HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Sindhu Replied To Pawan Kalyan After He Congratulated Her

PV Sindhu Scripts History : కంగ్రాట్స్ చెప్పిన పవన్ కళ్యాణ్‌కు సింధు ఎలాంటి రిప్లయ్ ఇచ్చిందో తెలుసా ?

పవన్ కళ్యాణ్ చేసిన పోస్టుకు పీవీ సింధు ఇచ్చిన రిప్లై ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తన విజయాన్ని అభినందించినందుకు డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూనే, వారిద్దరి మధ్య ఉన్న ఒక ఆసక్తికరమైన

  • Author : Latha Suma Date : 19-07-2026 - 3:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Sindhu
Pawan Sindhu

ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ 750 (Japan Open Super 750) టైటిల్ సాధించి, ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా స్టార్ షట్లర్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ స్టార్ ప్లేయర్ అకానే యమగూచిని ఆమె సొంత గడ్డపైనే మట్టికరిపించి సింధు అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ చారిత్రాత్మక గెలుపుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. సింధు చూపిన పోరాట పటిమ, అజేయ స్ఫూర్తి ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశాయని కొనియాడారు. సవాళ్లను అధిగమిస్తూ తిరిగి అగ్రపీఠాన్ని సొంతం చేసుకోవడం యువ క్రీడాకారులకు పెద్ద కలలు కనేలా స్ఫూర్తినిస్తుందని పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ అభినందనలకు వైఎస్ జగన్, నారా లోకేశ్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా తోడయ్యారు.

పవన్ కళ్యాణ్‌కు సింధు ఆసక్తికర సమాధానం.. ఇద్దరికీ ఒకే డాక్టర్ అంటూ గుట్టు విప్పిన ఛాంపియన్!

పవన్ కళ్యాణ్ చేసిన పోస్టుకు పీవీ సింధు ఇచ్చిన రిప్లై ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తన విజయాన్ని అభినందించినందుకు డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూనే, వారిద్దరి మధ్య ఉన్న ఒక ఆసక్తికరమైన కామన్ పాయింట్‌ను సింధు బయటపెట్టింది. ఇటీవల పవన్ కళ్యాణ్‌కు సర్జరీ చేసిన ప్రముఖ వైద్యులు డాక్టర్ దిన్షా పర్దివాలా (Dr. Dinshaw Pardiwala) దగ్గరే గత ఏడాది తాను కూడా చీలమండల గాయానికి (Ankle Injury) చికిత్స పొందినట్లు వెల్లడించింది. డాక్టర్ దిన్షా అత్యుత్తమ వైద్యుడని, ఆయన సంరక్షణలో పవన్ కళ్యాణ్ పూర్తిగా సురక్షితమైన చేతుల్లో ఉన్నారని పేర్కొంటూ.. డిప్యూటీ సీఎం త్వరగా కోలుకోవాలని (Speedy Recovery) ఆకాంక్షించింది. క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ఇద్దరు అగ్రశ్రేణి ప్రముఖులకు ఒకే డాక్టర్ చికిత్స అందించడం, దానిని సింధు ఈ సందర్భంగా గుర్తుచేయడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dr. Dinshaw Pardiwala Treatment
  • First Indian Shuttler Japan Open Title
  • Pawan Kalyan Congratulates PV Sindhu
  • PV Sindhu
  • PV Sindhu Japan Open Victory
  • PV Sindhu Reply to Deputy CM

Related News

PV Sindhu in Varanasi movie

SSRajamouli: వారణాసి సినిమాలో పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మరోసారి అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేయడం తెలిసిందే. ప్రతిష్ఠాత్మక జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి చారిత్రక ఘనతను అందుకుంది. నిన్న‌ జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో ఆమె జపాన్‌కు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణి అకనే యమగూచిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. హోరాహోరీగా స

  • Pv Sindhu Scripts History

    PV Sindhu Scripts History : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సంచలన విజయం

Latest News

  • Kuwait desalination plant: ఇరాన్ దాడి తర్వాత కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం..

  • Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద దాడికి గల 4 కారణాలు ఇవే

  • Anurag Dhankar: పోలీసు ప్రధాన కార్యాలయంలో త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ మృతి

  • Rohit Sharma: రిటైర్మెంట్ పై మౌనం వీడిన రోహిత్ శర్మ: ‘నేను వెళ్ళిపోవడం లేదు…

  • Poonam Pandey: నిరసనలో పాల్గొనేందుకు జంతర్ మంతర్ చేరుకున్న పూనమ్ పాండే

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd