YS Sharmila : షర్మిల సభలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు..
కర్నూలు జిల్లా ఆదోనీలో ఆమె ఎన్నికల ప్రచారం చేస్తుండగా...కొంతమంది వైసీపీ శ్రేణులు సిద్ధం జెండాలు పట్టుకుని సభలో అలజడి సృష్టించారు
- By Sudheer Published Date - 09:30 PM, Fri - 19 April 24

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడి వేడి గా నడుస్తుంది..ఎప్పుడు ఏంజరుగుతుందో..? ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అనే భయం అందరిలో ఆందోళన కలిగిస్తుంది. సీఎం జగన్ ఫై సతీష్ అనే యువకుడు రాయి దాడి చేయడం..ఆ తర్వాత చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ప్రచారంలో కొంతమంది రాళ్లు విసరడం వంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా..ఈరోజు షర్మిల (YS Sharmila) సభలో కొంతమంది వైసీపీ శ్రేణులు వైసీపీ జెండాలు పట్టుకొని నానా రభస చేయడం ఆందోళన కలిగించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి గా ప్రమాణం చేసిన దగ్గరి నుండి షర్మిల..తన అన్న జగన్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచారం లో కూడా అదే తరహాలో ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. దీంతో షర్మిల ఫై వైసీపీ ఆగ్రహం తో ఉంది. ఈ క్రమంలో ఈరోజు కర్నూలు జిల్లా ఆదోనీలో ఆమె ఎన్నికల ప్రచారం చేస్తుండగా…కొంతమంది వైసీపీ శ్రేణులు సిద్ధం జెండాలు పట్టుకుని సభలో అలజడి సృష్టించారు. సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ.. సీఎం జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు సిద్ధమయితే మేము కూడా సిద్ధమంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మిమ్మల్ని గద్దె దించేందుకు సిద్ధమని, త్వరలోనే ఇంటికి పంపుతామంటూ షర్మిల సవాల్ విసిరారు. పోలీసులు రంగంలోకి దిగి వైసీపీ శ్రేణులు అక్కడి నుండి పంపించడం తో కాస్త సద్దుమణిగింది.
Read Also : Telugu Students: స్కాట్లాండ్ లో దారుణం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి