AP : జగనన్న పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నాడు – షర్మిల
- By Sudheer Published Date - 09:33 PM, Wed - 7 February 24

ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila)..మరోసారి తన అన్న , ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) ఫై విరుచుకపడ్డారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దగ్గరి నుండి జగన్ ఫై ఏ రేంజ్ లో విరుచుకపడుతుందో తెలియంది కాదు..ఓ పక్క కాంగ్రెస్ వస్తే రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో చెపుతూనే..వైసీపీ ప్రభుత్వం , ముఖ్యంగా జగన్ ఫై తనకున్న ఆగ్రహాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వస్తుంది. ప్రస్తుతం జిల్లాల పర్యటన మొదలుపెట్టిన షర్మిల..ఈరోజు బాపట్ల నియోజక వర్గంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..మీరు దేనికి సిద్ధం జగన్ సార్..? మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా ? లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి.. బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా ? ప్రత్యేక హోదా ను మళ్ళీ బీజేపీ దగ్గర తాకట్టు పెట్టడానికి సిద్ధమా..మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి సిద్ధమా, 25 లక్షల ఇండ్లు కడతామని మోసం చేయడానికి సిద్ధమా.. లేక రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ మాఫియాకు సిద్ధమా అంటూ జగన్ పై మండిపడ్డారు.
We’re now on WhatsApp. Click to Join.
ఒకవేళ వీటికి మీరు సిద్ధమైతే… ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం అంటూ జగన్ పై ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు. ప్రత్యేక హోదా పై జగన్ చేతులు ఎత్తేశారని, బీజేపీ కి పూర్తి మెజారిటీ వస్తుందని, ఏమీ చేయలేమని అంటున్నారని గుర్తు చేశారు. రాష్ట్రానికి రాజధాని లేదని, పోలవరం ఇవ్వలేదని.. ఎందుకు ఇన్నాళ్లు కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదని జగన్ ను ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అన్న పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారని, ఎప్పుడూ ప్రజల మధ్యకు రారు, కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని సిద్ధం అంటూ వస్తున్నాడని షర్మిల ఎద్దేవా చేసారు.
Read Also : Telangana : కాళేశ్వరం ENC ఇంచార్జి వెంకటేశ్వర్ రావు తొలగింపు..