Telangana : కాళేశ్వరం ENC ఇంచార్జి వెంకటేశ్వర్ రావు తొలగింపు..
- By Sudheer Published Date - 09:05 PM, Wed - 7 February 24

తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)..గత ప్రభుత్వంలో కీలక శాఖల్లో పనిచేసిన ఉద్యోగులపై వేటు వేస్తూ వస్తుంది. బిఆర్ఎస్ హయంలో పెద్ద ఎత్తున అన్ని శాఖల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వచ్చిన కాంగ్రెస్..ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ అవినీతిని బయటకు లగే పని చేస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంది..ఇదే క్రమంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం తో ఈ ఆరోపణలను నిజం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం నీటిపారుదల శాఖ ఫై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా నీటి పారుదల శాఖలో ప్రభుత్వం భారీ ప్రక్షాళన మొదలుపెట్టింది. ఈఎన్సీ మురళీధర్ రావు (ENC Muralidhar) రాజీనామా చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆదేశించారు. రామగుండం ఈఎన్సీ, కాళేశ్వరం ఈఎన్సీ ఇంచార్జి వెంకటేశ్వర్ రావును సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తమ్ ఆదేశాలు జారీ చేశారు. మరికొంత మంది ఇంజినీర్లపైనా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది.
Read Also : Curries: రాత్రి చేసిన కూరని పొద్దున్నే తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే?