HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Sharmila Comments Kutami Mps

YS Sharmila : చంద్రబాబు – పవన్ కళ్యాణ్ వల్లే మోడీకి ఆ ధైర్యం – షర్మిల

YS Sharmila : టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 45 మీటర్ల ఎత్తుతో నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును 41 మీటర్లకు తగ్గించేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నా

  • Author : Sudheer Date : 28-06-2025 - 12:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi Cbn Pawan
Modi Cbn Pawan

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) రాష్ట్ర రాజకీయాల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుతో రాష్ట్ర హక్కులు తుడిచిపెట్టుకుపోతున్నా, రాష్ట్రంలోని ఏ ఒక్క ఎంపీ కూడా కేంద్రాన్ని ప్రశ్నించలేదని ఆమె మండిపడ్డారు. టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 45 మీటర్ల ఎత్తుతో నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును 41 మీటర్లకు తగ్గించేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నా, దీనిపై ప్రతిపక్షాలు మౌనం వహించడం దారుణమని విమర్శించారు. “ఒక్క మగాడు కూడా కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నాడా?” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Anchor Swetcha Votarkar : మానసిక వేదింపులు తట్టుకోలేక యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్‌ ఆత్మహత్య చేసుకుందా..?

రాష్ట్ర రైతుల హక్కుల కోసం, నీటి పంపిణీలో తలెత్తుతున్న వివాదాలపై కాంగ్రెస్ పోరాటానికి సిద్ధంగా ఉందని షర్మిల చెప్పారు. బనకచర్ల స్లూయిస్ అంశాన్ని ప్రస్తావిస్తూ, అది కేవలం ప్రాంతీయ సమస్య మాత్రమే కాదని, రాష్ట్రవ్యాప్తంగా రైతుల హక్కులతో సంబంధముందని స్పష్టంచేశారు. “కాంగ్రెస్ ఒక మహాసముద్రం లాంటిది. పిల్ల కాలువలన్నీ చివరికి సముద్రంలో కలవాల్సిందే” అంటూ వైసీపీకి కూడా కాంగ్రెస్‌లో చేరే రోజు వస్తుందని సూచనీయంగా వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రధాని మోదీకి ఇచ్చే మద్దతుతోనే ఆయన కేంద్రంలో ధైర్యంగా వ్యవహరిస్తున్నారని షర్మిల ఆరోపించారు. విభజన హామీలు నెరవేర్చడం కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ బలపడాలన్నది ఆమె అభిప్రాయం. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విద్యుత్ నష్ట పరిహారం వంటి హామీలు నెరవేర్చాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందేనని ఆమె తేల్చిచెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • chandrababu
  • congress
  • janasena mp
  • modi
  • Pawan Kalyan
  • polavaram
  • ys sharmila

Related News

West Bengal Congress

West Bengal Result 2026 : బెంగాల్లో కాంగ్రెస్ ‘జీరో’

ఐదు రాష్ట్రాల్లో కేరళ ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి ఊరటనిస్తోంది. అక్కడ పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ (LDF)పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు వరంగా మారింది. యూడీఎఫ్ (UDF) కూటమి ఏకంగా 99 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుండగా

  • Rahul Vote Chori Haryana

    Rahul : సెంచరీకి చేరువలో రాహుల్ అంటూ పరువు తీసిన బిజెపి

  • Mamatha Neet

    West Bengal Result 2026 : మమతా బెనర్జీ కీలక ప్రకటన

  • Tamilisai

    Tamilisai Soundararajan : తమిళిసైకి వరుసగా ఏడో ఓటమి!

Latest News

  • Flaxseed: రోజూ అవిసె గింజల పొడి తింటే కలిగే లాభాలు ఇవే…!

  • IPL 2026: ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం.. టాప్ 4 చేరేదెవ్వరు?

  • Rahul Gandhi: విజయ్‌తో రాహుల్ గాంధీ ‘రీల్’ను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపణ..

  • Anna Lezhneva: మోదీకి ప్రామిస్ చేశా.. అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్ వైరల్

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd