Koneti Adimulam : వైసీపీ లోకి ఆదిమూలం..?
Satyavedu MLA Adimulam Joins YCP..? : ఇప్పటికే వైసీపీ (YCP) లో ఇలాంటి నేతలు చాలామందే ఉన్నారు..ఇప్పటికే వారి తాలూకా వీడియోస్ కూడా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
- By Sudheer Published Date - 02:53 PM, Fri - 13 September 24

Satyavedu MLA Adimulam Joins YCP : సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం (MLA Koneti Adimulam) తిరిగి వైసీపీ లోకి చేరేందుకు సిద్దమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. సమాజంలో ఓ గౌరవ స్థానంలో ఉండి..ఓ మహిళా పై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆదిమూలం. దీంతో టీడీపీ పార్టీ ఈయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అంతే కాదు బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదిమూలం (Koneti Adimulam)పై ఎఫ్‌ఐఆర్ నెంబర్ 430/24 కేసు పెట్టారు. ఇక టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యాక తీవ్ర మనస్తాపానికి గురైన ఆదిమూలం..వైసీపీ లో చేరేందుకు సిద్దమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవరానికి ఈయన వైసీపీ నేతే..కాకపోతే ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి టీడీపీలో చేరి సత్యవేడు ఎమ్మెల్యేగా గెలిచారు.
కానీ మూడు నెలలు గడవకముందే టీడీపీకి ఆయన దూరమయ్యారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సస్పెన్షన్ వేటు వేయడంతో ఆదిమూలం మనస్థాపానికి గురయ్యారు. ఇంత జరిగాక పార్టీలో ఉండడం అంత మంచిది కాదని..వైసీపీ లో చేరడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారట. మరి ఈయన్ను జగన్ చేర్చుకుంటారా..? అనేది సస్పెండ్ గా మారింది. ఇప్పటికే వైసీపీ (YCP) లో ఇలాంటి నేతలు చాలామందే ఉన్నారు..ఇప్పటికే వారి తాలూకా వీడియోస్ కూడా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఉన్న ఈ రచ్చ చాలదా..మళ్లీ కొత్తగా ఈ రచ్చ ఎందుకు అని జగన్ (Jagan) అనుకుంటారో..? లేక ఎమ్మెల్యేల సంఖ్య ఒకటి పెరుగుతుందని చెప్పి అక్కున చేర్చుకుంటారో చూడాలి.
Read Also : Roja : పార్టీ వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టిన రోజా