Sajjala : తగ్గేదేలే అంటున్న సజ్జల..ఏ విషయంలో అనుకుంటున్నారు ..!!
Sajjala Ramakrishna Reddy : ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై గళమెత్తడమే అని ఈ విషయంలో రాజీ పడేది లేదని ఆయన అన్నారు
- By Sudheer Published Date - 04:13 PM, Tue - 10 December 24

ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తామని వైసీపీ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై గళమెత్తడమే అని ఈ విషయంలో రాజీ పడేది లేదని ఆయన అన్నారు. మంగళవారం పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్(Teleconference Meeting With Party Leaders)లో సజ్జల పలు సూచనలు చేశారు. “ప్రజల గొంతుకగా మనం వ్యవహరించాలి. వారి కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, సమాధానాలు వచ్చే వరకు నిరంతరం పోరాడాలి” అని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనుక్షణం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి బాధితుల తరఫున తమ గళం వినిపించడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని , సమస్యలపై చర్చలు జరుగేవరకూ నిస్సహాయులుగా నిలబడకుండా, బాధితులకు అండగా ఉంటూ పోరాటాన్ని కొనసాగించాలి” అని సజ్జల పేర్కొన్నారు.
సజ్జల చెప్పిన దిశానిర్దేశంతో.. పార్టీ నాయకత్వం ప్రజా సమస్యలపై మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. కూటమి ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాడాలని పార్టీ నేతలతో ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంలో వెనుకాడకూడదని ఆయన ఆదేశించారు. ప్రజల సంక్షేమం కోసం వైసీపీ చేసే పోరాటం ఏ రూపంలోనైనా నిలకడగా కొనసాగుతుందని సజ్జల హామీ ఇచ్చారు. ప్రజల విశ్వాసం పొందడం కోసం ప్రతి నాయకుడు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఈ విధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈయన మాటలు విన్న ప్రజలు..అధికారంలో ఉన్న సమయంలో ప్రజల సమస్యల పై పెద్దగా దృష్టి పెట్టని సజ్జల రామకృష్ణ..అధికారం కోల్పోయేసరికి ప్రజలు, ప్రజల సమస్యలు గుర్తిస్తున్నాయి అంటూ సెటైర్లు వేస్తున్నారు.
Read Also : Threat Call : పవన్ కళ్యాణ్ ను చంపేస్తా అంటూ బెదిరించిన వ్యక్తి అరెస్ట్..