Auto Drivers : ఆటో, క్యాబ్ డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లోకి రూ.15 వేలు జమ చేయనున్నారు.!
- By Vamsi Chowdary Korata Published Date - 03:38 PM, Fri - 3 October 25
Auto Drivers Scheme అక్టోబర్ 4వ తేదీన ఆటో, క్యాబ్ డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా అర్హత గల ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందుకోనున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు కారణంగా ఇబ్బంది పడకూడదని క్యాబ్, ఆటో డ్రైవర్ల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.
Andhra Pradesh మొత్తం లబ్దిదారుల ఖాతాల్లో రూ.435 కోట్లు జమ

AutodriversSevalo
మొత్తం 3,23,375 దరఖాస్తులు రాగా, ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 2,90,234 మంది డ్రైవర్లను అర్హులుగా గుర్తించినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. వారి ఖాతాల్లో మొత్తం రూ.435.35 కోట్లు జమ కానున్నాయి. అర్హులైన లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోతే ఆందోళన చెందవద్దని, సంబంధిత సమస్యను పరిష్కరించి వారి పేర్లను జాబితాలో చేర్చి ఆర్థిక సహాయం చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల స్పష్టం చేశారు. ప్రతి ఏడాది ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం సుమారు రూ.435 కోట్లు ఖర్చు చేయనుంది. ఆటో డ్రైవర్లతో పాటు క్యాబ్ డ్రైవర్లకూ ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం ద్వారా డ్రైవర్ల ఆదాయ భద్రతకు దోహదం చేస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.