RGV : ఏపీ ఫలితాలపై వర్మ ట్వీట్..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి 0-175 అసెంబ్లీ స్థానాలు వస్తాయని, అదేవిధంగా టీడీపీ కూటమికి కూడా 0-175 అసెంబ్లీ స్థానాలు వస్తాయని తెలిపారు
- By Sudheer Published Date - 10:00 PM, Sun - 2 June 24

మరికొద్ది గంటల్లో ఏపీలో ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ కూటమికే పట్టం కట్టడంతో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో వైసీపీ సైతం గెలుపు ఫై ధీమాగా ఉన్నారు. కూటమి గెలుస్తుందని చెప్పిన సర్వేలు అన్ని కూడా జాతీయ సంస్థల్ని..వారు ప్రజల వద్దకు వచ్చి సర్వే చేసింది లేదని..టీడిపి చూపిన లెక్కలే వేసుకున్నారని..కానీ లోకల్ సంస్థలు మాత్రం వైసీపీ గెలుస్తుందని చెప్పాయని..అవే నిజం కాబోతున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ తరుణంలో వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ..ట్విట్టర్ వేదికగా ఫలితాలపై ట్వీట్ చేసి వార్తల్లో నిలిచాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి 0-175 అసెంబ్లీ స్థానాలు వస్తాయని, అదేవిధంగా టీడీపీ కూటమికి కూడా 0-175 అసెంబ్లీ స్థానాలు వస్తాయని తెలిపారు. ఎంపీ స్థానాల్లో వైసీపీ, కూటమికి 0-25 ఎంపీ స్థానాలు వస్తాయని అంచనా వేసిన ఓ ఎగ్జిట్ పోల్ వర్మ షేర్ చేశారు. అయితే ఆ ట్వీ్ట్ చూసిన నెటిజన్లు.. ‘వీడినీ ఎవరికైనా చూపించండ్రా అలా వదిలేయకండ్రా’ అంటూ కామెంట్ చేశారు, మరికొందరేమో.. ‘ఇది జోక్.. దానికి మేము ఇప్పుడు నవ్వాలా’ అంటూ రిప్లై ఇచ్చారు.
This has to be the MOST ACCURATE SURVEY 🙏🙏🙏 https://t.co/XllDH47M3X
— Ram Gopal Varma (@RGVzoomin) June 2, 2024
Read Also : Telangana Formation Day : ట్యాంక్ బండ్ పై అంబరాన్ని తాకిన దశాబ్ది ఉత్సవాలు