Kethireddy : మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి షాక్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు
Kethireddy : గుర్రాల కొండ(Gurrala konda )పై కేతిరెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్టర్ చేయించుకున్న గెస్ట్ హౌస్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా గుర్తించారు.
- Author : Sudheer
Date : 04-04-2025 - 7:47 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి(Kethireddy Venkatarami Reddy)కి రెవెన్యూ అధికారులు షాక్ (Revenue officials shocked) ఇచ్చారు. గుర్రాల కొండ(Gurrala konda )పై కేతిరెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్టర్ చేయించుకున్న గెస్ట్ హౌస్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా గుర్తించారు. సమాచారం మేరకు దాదాపు రెండున్నర ఎకరాల అసైన్డ్ భూమిని ఆయన తన కుటుంబ సభ్యుల పేరుతో అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులకు సమాచారం అందడంతో వెంటనే చర్యలు చేపట్టారు.
Waqf Bill : రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు ఆమోదం
గుర్రాల కొండపై ఉన్న ఈ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు ఇటీవల వెళ్లారు. అయితే కొండపైకి వెళ్లే మార్గంలో గేటు ఉండటంతో వీఆర్ఓలు అక్కడే నిలిచిపోయారు. భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవడంతో అధికారులు వెనుదిరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారం స్థానిక రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి తన కుటుంబ సభ్యుల పేరుతో కేతిరెడ్డి రిజిస్టర్ చేయించుకోవడంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Waqf Bill : వక్ఫ్ బిల్లుపై జగన్ మౌనం.. కారణం అదే – టీడీపీ
ఈ భూవివాదంపై కేతిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గెస్ట్ హౌస్ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు తీసుకుంటున్న చర్యలను నిలిపివేయాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు విచారణ నిర్వహించనుంది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలకు వ్యతిరేకంగా కేతిరెడ్డి ఏ విధంగా న్యాయపరమైన పోరాటం చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.