AP : ఏపీలో రేవంత్ ప్రచారం..జగన్ తట్టుకోగలడా..?
- By Sudheer Published Date - 09:19 PM, Fri - 16 February 24

ఇప్పటికే వైసీపీ (YCP) అధినేత, సీఎం జగన్ (Jagan) కు వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. సర్వేల ఆధారంగా నియోజకవర్గాల ఇంచార్జ్ ల మార్పు వల్ల ఇప్పటీకే చాలామంది వైసీపీ కి బై బై చెప్పి ఇతర పార్టీలలో చేరారు..మరికొంతమంది చేరే అవకాశం ఉంది. మరోపక్క టీడీపీ – జనసేన (TDP-Janasena) పొత్తులో బిజెపి (BJP) చేరేందుకు సిద్ధమైంది..వీటి అన్నింటికంటే సొంత చెల్లి షర్మిల తో పెద్ద సమస్య వచ్చి పడింది. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యత చేపట్టిన దగ్గరి నుండి జగన్ ను టార్గెట్ గా పెట్టుకుంది. ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తూనే..మరోపక్క వ్యక్తిగత విమర్శలు చేస్తూ చెమటలు పట్టిస్తుంది. ఇలా ఇన్ని సమస్యలతో సతమవుతుండగా..ఇప్పుడు మరో సమస్య ఎదురుకాబోతుంది.
మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా తో ప్రజల్లోకి వెళ్తున్నారు..అలాగే నారా లోకేష్ కూడా శంఖారావం తో యాత్ర చేపట్టారు. మరికొద్ది రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగుతున్నాడు. ఇక షర్మిల సైతం యాత్ర కొనసాగిస్తోంది. ఇలా అంత ప్రచారంలో బిజీ అవుతున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ సైతం ఏపీలో ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ (Congress) పూర్తిగా కనుమరుగైన సంగతి తెలిసిందే. అటు తెలంగాణ లోను పదేళ్లుగా అధికారంకు దూరమైంది. ఈ క్రమంలో రేవంత్ పగ్గాలు చేపట్టి..ఏకంగా అధికారంలోకి వచ్చేలా చేసాడు. ఇక ఇప్పుడు ఏపీలోనూ అధికారం లోకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఏపీసీసీ చీఫ్ గా షర్మిల (YS Sharmila) తన దూకుడు కనపరుస్తుండగా..ఇక షర్మిల కు తోడుగా రేవంత్ బరిలోకి దిగబోతున్నాడు. నెలాఖరులోపు విశాఖపట్నంలో బహిరంగసభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అదే సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటీవల షర్మిల రేవంత్ రెడ్డిని కలిసి.. ఏపీ రాజకీయాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలన్నదానిపై మాట్లాడారు. బహిరంగసభలకు తాను హాజరవుతానని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఏ జిల్లా నుంచి ఎన్నికల శంఖారావాన్ని మొదలుపెట్టనుందనే విషయాన్ని పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి ఈరోజు మీడియాకు తెలియజేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మాట్లాడి అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తామని వెల్లడించారు. పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని , ఈ నెల 26న మల్లికార్జున ఖర్గే, వైఎస్ షర్మిల, మాణిక్యం ఠాగూర్‌లతో కలసి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ ప్రచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశాఖపట్నం వస్తున్నారని, ఆయనతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడా వస్తారని స్పష్టంచేశారు. ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకా గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదాకు అగ్రనేత రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. సో రేవంత్ ..ఏపీ లో తన వాయిస్ వినిపించబోతున్నాడు. మరి రేవంత్ ప్రచారంలో తన గురువు చంద్రబాబు ఫై విమర్శలు చేస్తారా..? లేక జగన్ ను మాత్రమే టార్గెట్ చేస్తాడా అనేది చూడాలి. ఏది ఏమైనప్పటికి జగన్ కు ప్రస్తుతం ఉన్న టెన్షన్ లకు మరికొన్ని టెన్షన్లు తప్పడం లేదని అర్ధం అవుతుంది.
Read Also : Ram Puri Jagannath : డబుల్ ఇస్మార్ట్.. ఈ డేట్ కు ఫిక్స్ అయారా..?