Ramagiri SI Warning To YS Jagan : జగన్ కు సాయి కుమార్ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చిన SI
Ramagiri SI Warning To YS Jagan : పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జగన్, వారి యూనిఫారంలను ఊడదీసి ప్రజల ముందు నిలబెడతామని హెచ్చరించారు
- By Sudheer Published Date - 12:16 PM, Wed - 9 April 25

పాపిరెడ్డిపల్లిలో వైఎస్ జగన్ (Jagan) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. వైసీపీ నేతలపై దాడులు, పార్టీ కార్యకర్త లింగమయ్య హత్య (Lingamayya’s Murder) నేపథ్యంలో జగన్ స్పందించిన తీరు వివాదాస్పదమైంది. పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జగన్, వారి యూనిఫారంలను ఊడదీసి ప్రజల ముందు నిలబెడతామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని రామగిరి ఎస్ఐ సుధాకర్ (Ramagiri SI Sudhakar) ధీటుగా స్పందించారు. జగన్ మాటలు తీవ్రంగా తప్పుబట్టిన ఆయన, పోలీసు డ్యూటీ ఏవిధంగా సంపాదించారో వివరించారు.
“పోలీసు డ్రెస్ అరటితొక్క కాదంటూ” ఎస్ఐ కౌంటర్
రామగిరి ఎస్ఐ సుధాకర్ సెల్ఫీ వీడియో ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “పోలీసు దుస్తులు జగన్ ఇచ్చినవి కావు. రన్నింగ్, మెడికల్, కఠినమైన పరీక్షల్ని క్లియర్ చేసి ఈ ఉద్యోగాన్ని సంపాదించాం” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎవరు వచ్చి ఊడదీస్తానన్నా ఇది అరటితొక్క కాదని తేల్చిచెప్పారు. తాము ప్రజల పక్షాన, న్యాయబద్ధంగా, సత్యపథంలో నిలబడతామని, అడ్డదారులు తొక్కేది లేదని స్పష్టం చేశారు. జగన్ మాటలు ప్రజల మనోభావాలకు, పోలీసు వ్యవస్థ ప్రతిష్టకు తూచ తప్పినట్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు.
TDP : వర్మకు చంద్రబాబు బంపర్ ఆఫర్..?
లింగమయ్య హత్య కేసు విచారణలో పోలీసుల వ్యవహారంపై జగన్ ప్రశ్నలు సంధించడాన్ని తిరుగుబాటుగా చూస్తున్నారు వైసీపీ నేతలు. అయితే అధికార కూటమి మాత్రం జగన్ వ్యాఖ్యలను క్షమించలేనివిగా భావిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగంపై అంతర్జాతీయ స్థాయిలో కూడా అవమానకరంగా ఉండేలా చేసిన వ్యాఖ్యలు భావోద్వేగానికి లోనయ్యేలా చేశాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక జగన్ రాజకీయ ఆరోపణలకు రామగిరి ఎస్ఐ ఇచ్చిన కౌంటర్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఇది రాబోయే రోజుల్లో రాజకీయ వేడి మరింత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైఎస్ జగన్ వ్యాఖ్యలపై రామగిరి ఎస్సై సుధాకర్ ఘాటు వ్యాఖ్యలు- “యూనిఫాం నువ్వు ఇస్తే వేసుకున్నది కాదు. రాజ్యాంగం మాకిచ్చిన గౌరవం అది. నువ్వు వచ్చి ఊడదీస్తా అంటే ఇది అరటితొక్క కాదు. చట్ట ప్రకారం నడుచుకుంటాం. జాగ్రత్తగా మాట్లాడు” అని హెచ్చరిక#YSJagan #RamagiriSI #SISudhakar pic.twitter.com/GdvmShiOIu
— C L N Raju (@clnraju) April 9, 2025