Pawan Kalyan : అమరావతికి రైల్వే లైన్..స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం
Pawan Kalyan : గతంలో ప్రధాని మోడీ అమరావతి శంకుస్థాపనకు వచ్చారు. కానీ కొంతమంది వలన అర్ధ శతాబ్దం విలువైన సమయం వృధా అయిందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
- Author : Latha Suma
Date : 24-10-2024 - 6:07 IST
Published By : Hashtagu Telugu Desk
Amaravati Railway Project : ఏపీకి అమరావతి రైల్వే ప్రాజెక్ట్ కి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అమరావతి రైల్వే ప్రాజెక్ట్ ఏపీకి పెద్ద బూస్ట్, వీలైనంత త్వరగా అనుధానతి రైల్వే ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఇది రాజధాని అమరావతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. గతంలో ప్రధాని మోడీ అమరావతి శంకుస్థాపనకు వచ్చారు. కానీ కొంతమంది వలన అర్ధ శతాబ్దం విలువైన సమయం వృధా అయిందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
ఏపీ రాజధాని అమరావతి రైల్వే లైన్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. గంటూరు జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త రైల్వే లైన్ వేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని కోసం 57 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అదేవిధంగా రూ. 2,245 కోట్లు విడుదల కు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా కృష్ణా నది పై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే బ్రిడ్జి ను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది.
Read Also: Supreme court : గడియారం గుర్తు.. శరద్‌పవార్ పార్టీకి షాక్.. అజిత్ పవార్‌కు ఊరట..