HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Raghurama Krishna Raju Was Unanimously Elected As The Deputy Speaker Of The Ap Legislature

AP Deputy Speaker : ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నిక

స్పీకర్‌గా తన పేరు ఖరారు కావడంతో రఘురామకృష్ణరాజు బుధవారం అసెంబ్లీలో సందడి చేశారు. ఆయనకు కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా అభినందనలు తెలిపారు.

  • Author : Latha Suma Date : 14-11-2024 - 1:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Raghurama Krishna Raju was unanimously elected as the Deputy Speaker of the AP Legislature
Raghurama Krishna Raju was unanimously elected as the Deputy Speaker of the AP Legislature

Raghuramakrishna Raja : ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు రఘురామ పేరును ప్రకటించారు. అయితే ఈ పదవికి ఒక్క నామినేషన్‌ మాత్రమే దాఖలు కావడంతో రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఇక ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా తన పేరు ఖరారు కావడంతో రఘురామకృష్ణరాజు బుధవారం అసెంబ్లీలో సందడి చేశారు. ఆయనకు కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా అభినందనలు తెలిపారు.

కాగా, డిప్యూటీ స్పీకర్‌ పదవికి కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు పేరును మంగళవారం రాత్రి సీఎం చంద్రబాబు ఖరారు చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆ పదవికి రఘురామ పేరును ప్రతిపాదిస్తూ టీడీపీ తరఫున మంత్రి లోకేశ్‌, జనసేన తరఫున డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, బీజేపీ తరఫున విష్ణుకుమార్‌ రాజు సంతకాలు చేశారు. ఈ కాపీలతో కూడిన మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలను అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ ప్రసన్న కుమార్‌ సూర్యదేవరకు సాయంత్రం 4.30 గంటలకు రఘురామకృష్ణరాజు అందించారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్‌ గడువు ముగిసేవరకి.. రఘురామ తప్ప మరెవ్వరు నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది.

కాగా, రఘురామకృష్ణరాజు 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఇక రచ్చబండ పేరుతో రఘురామకృష్ణరాజు ఎప్పటికప్పుడు.. అధికార పార్టీ నేతల అవినీతి, అక్రమాలను ఎండగట్టారు. దీంతో ఆగ్రహించిన వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి, కస్టడీలో చిత్రహింసలు పెట్టింది. 2024 ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజు ఉండి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Read Also: KTR : కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం.. అందుకే…!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap deputy speaker
  • CM Chandrababu
  • Raghuramakrishna Raja
  • Speaker Ayyanna Patrudu
  • Undi MLA

Related News

Iftar Ramadan

Ramadan 2026 : ఏపీ ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

రాష్ట్ర స్థాయి ప్రధాన ఇఫ్తార్ వేడుక ఈ నెల 16వ తేదీన విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత వైభవంగా జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరై, ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు

  • Manoj Babu

    Andhra Govt to Ban Social Media : చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పై మంచు హీరో రియాక్షన్

Latest News

  • Grijp 20 Gratis Kansen om de Magie van spin maya te Ontketenen

  • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

  • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd