TTD : నవంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా వివరాలు..
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఆగష్టు 19వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
- By Latha Suma Published Date - 06:14 PM, Tue - 13 August 24

TTD Arjitha Seva Tickets : తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఆగష్టు 19వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగష్టు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు ఆగష్టు 21వ తేదీ నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరు అవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను, అదేవిధంగా నవంబరు 9వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పుష్పయాగం సేవ టికెట్లను ఆగష్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆగష్టు 22న వర్చువల్ సేవల కోటా విడుదల వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఆగష్టు 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఆగష్టు 23న అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేస్తున్నారు. నవంబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆగష్టు 23వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన నవంబరు నెల ఆన్ లైన్ కోటాను ఆగష్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టిక్కెట్లు విడుదల చేస్తున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆగష్టు 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఆగష్టు 24వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తున్నారు. నవంబరు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగష్టు 24వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల చేయనున్నారు. తిరుమల, తిరుపతిలలో నవంబరు నెల గదుల కోటాను ఆగష్టు 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఆగష్టు 27వ తేదీన శ్రీవారి సేవ కోటా విడుదల చేస్తున్నారు. ఆగష్టు 27వ తేదీన తిరుమల, తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.