Jagan : చిత్రసీమను జగన్ భయపెడుతున్నాడు – నట్టి కుమార్
జగన్ (Jagan) చేతలతో ఏపీ అంధకారంలోకి వెళ్లిపోయిందని అన్నారు. ప్రజలంతా కూటమి గెలవాలని కోరుకుంటున్నారు
- Author : Sudheer
Date : 03-05-2024 - 10:10 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ (Tollywood) చిత్రసీమను ఏపీ సీఎం జగన్ భయపెడుతున్నాడని ఆరోపించారు నిర్మాత నట్టికుమార్ (Producer Natti Kumar). శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నట్టికుమార్..జగన్ ఫై అలాగే పోసాని కృష్ణ మురళి ఫై నిప్పులు చెరిగారు. జగన్ (Jagan) చేతలతో ఏపీ అంధకారంలోకి వెళ్లిపోయిందని అన్నారు. ప్రజలంతా కూటమి గెలవాలని కోరుకుంటున్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఎన్నారైలు చంద్రబాబుకి సపోర్ట్ చేస్తున్నారు. కానీ సినిమా వారు ఎందుకు బయటకు రావడం లేదు? అని ప్రశ్నించారు.
We’re now on WhatsApp. Click to Join.
చిత్రసీమ ప్రముఖులను జగన్ భయపెడుతున్నాడని, సినిమా వాళ్లను తిట్టడానికే పోసాని కృష్ణమురళీకి ఎఫ్‌డీసీ పదవి ఇచ్చారని విమర్శించారు. బెదిరింపు ధోరణిలో పోసాని (Posani)మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సినిమా వారంతా ధైర్యంగా బయటికొచ్చి మీరు ఇష్టమైనవారికి మద్దతు పలకాలి పిలుపునిచ్చారు. ఏపీతోపాటు సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే కూటమి అధికారంలోకి రావాలి. జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేయాలి’’ అని అన్నారు. పోసాని మైక్ ముందుకొచ్చి ఏదేదో వాగుతున్నాడు. జగన్‌ని చంద్రబాబు చంపేస్తానని అన్నారంటే పిచ్చివాగుడు వాగుతున్నాడు. పోసానికి దమ్ము ఉంటే వివేకా మర్డర్, కోడి కత్తి, గులకరాయి డ్రామా గురించి మాట్లాడాలి అని సవాల్ విసిరారు.
అలాగే ముద్రగడ ఫై కూడా నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కన్న బిడ్డే మీపై విమర్శలు సంధిస్తుంది. పవన్ లక్ష మెజారిటీతో గెలవబోతున్నారు. జగన్ ముద్రగడకు ఏమి హామీ ఇచ్చాడు. కాపులకు కాపులే శత్రువు అనేలా ముద్రగడ వ్యవహారశైలి ఉందన్నారు.
Read Also : Enugula Rakesh Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేశ్ రెడ్డి