HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Political Leaders Reacting To Chandrababu Arrest

Chandrababu Arrest: ఇది కేవలం కక్షసాధింపు చర్య.. చంద్రబాబుని 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలన్నదే జగన్ లక్ష్యం: బాలకృష్ణ

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ (Chandrababu Arrest) చేయడాన్ని టీడీపీ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా ఖండిస్తున్నాయి.

  • Author : Gopichand Date : 09-09-2023 - 9:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Arrest:
Reaction

Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ (Chandrababu Arrest) చేయడాన్ని టీడీపీ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా ఖండిస్తున్నాయి. రాత్రికి రాత్రే చంద్రబాబుని అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయనను ఎలాగైనా అరెస్టు చేయాలన్న కోరికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈవిధంగా తీర్చుకోవడం అత్యంత దారుణం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఒక చీకటి రోజు అని ఎంపీ రఘు రామకృష్ణ రాజు పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు @ncbn అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయనను ఎలాగైనా అరెస్టు చేయాలన్న కోరికను ముఖ్యమంత్రి @ysjagan ఈవిధంగా తీర్చుకోవడం అత్యంత దారుణం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఒక చీకటి రోజు – @RaghuRaju_MP

— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) September 9, 2023

బాలకృష్ణ రియాక్షన్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. జగన్ పాలకుడు కాదు కక్ష్యదారుడని విరుచుకుపడ్డారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ దుర్మార్గమన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నాడు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ప్రతిపక్షనేతలపై కక్ష్యసాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యమన్నారు. ‘‘నేను 16 నెలలు జైల్లో ఉన్నాను. చంద్రబాబు నాయుడుని 16 నిమిషాలైన జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టు జగన్ కక్ష్యసాధిస్తున్నారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ గుడివాడ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు నిరసనకు పిలుపునిచ్చారు. దీనితో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావుని హౌస్ అరెస్ట్ చేసి పార్టీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.

🟥 @JaiTDP అధ్యక్షులు @ncbn అరెస్టును ఖండిస్తూ నిరసనకు పిలిపించిన గుడివాడ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు

🟥మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావుని హౌస్ అరెస్ట్ చేసి పార్టీ కార్యాలయ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు pic.twitter.com/p1dqYSIIvI

— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) September 9, 2023

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా కడపలో టీడీపీ నేతల ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

🟥చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా కడపలో టీడీపీ నేతల ఆందోళన

🟥ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/Rn35rkZR1Y

— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) September 9, 2023

ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది.సరైన నోటీసు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బిజెపి దీనిని ఖండిస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ట్వీట్ చేశారు.

ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది.సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బిజెపి దీనిని ఖండిస్తుంది.

— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) September 9, 2023

చంద్రబాబు అరెస్టు వైసీపీ అరాచక పాలనకు పరాకాష్ట అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. శనివారం ఉదయం తిరుపతిలో ఆయన మీడియా తో మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు 14సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తిని ఎటువంటి ఆధారాలు చూపించకుండా పోలీసులు అరెస్ట్ చెయ్యడం వైసీపీ పాలనకు అద్దం పడుతోందన్నారు.

మాజీ CM @ncbn అరెస్టు YCPఅరాచక పాలనకు పరాకాష్ట అని CPI జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు.శనివారం ఉదయం తిరుపతి లో ఆయన మీడియా తో మాట్లాడుతూ మాజీ CM CBN 14సంవత్సరాలు CMగా పనిచేసిన వ్యక్తిని ఎటువంటి ఆధారాలు చూపించకుండా పోలీసులు అరెస్ట్ చెయ్యడం YCP పాలనకు అద్దం పడుతోందన్నారు. pic.twitter.com/hgTOnCDdFs

— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) September 9, 2023


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • bjp
  • Chandrababu Arrest
  • Political Leaders Reaction
  • Politics In AP
  • tdp

Related News

Jagan

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకోవడానికి తాము ఇక్కడ లేమని, కేవలం ప్రచారం కోసం లేదా రాజకీయ కారణాలతో ఇటువంటి పిల్స్ వేస్తున్నారా అని ఎంపీ గురుమూర్తిని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది.

    Latest News

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

    • పచ్చిమిర్చి కేవలం రుచి కోసమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు!

    • చెరకు రసం తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

    • ఇన్‌స్టాగ్రామ్ వాడేవారికి బిగ్ అప్డేట్‌!

    • బీసీసీఐ అవార్డ్స్.. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా శుభ్‌మన్ గిల్, స్మృతి మంధాన!

    Trending News

      • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

      • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

      • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

      • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

      • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd