HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Police Case Filed On Mahasena Rajesh

Mahasena Rajesh : మహాసేన రాజేశ్ పై కేసు నమోదు

Mahasena Rajesh : సోషల్ మీడియాలో తనపై జనవరి, ఫిబ్రవరిల్లో అనుచిత పోస్టులు చేశారని శంకరగుప్తంకు చెందిన నేతల శాంతి.. రాజేష్ తో పాటు ఆయన అనుచరులు

  • Author : Sudheer Date : 16-11-2024 - 11:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Case File Rajesh
Case File Rajesh

టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్ ( Mahasena Rajesh), అతని అనుచరులపై కేసు నమోదైంది. తన ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టారని ఓ మహిళ ఫిర్యాదు చేయగా, కోనసీమ జిల్లా మలికిపురం స్టేషన్లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో తనపై జనవరి, ఫిబ్రవరిల్లో అనుచిత పోస్టులు చేశారని శంకరగుప్తంకు చెందిన నేతల శాంతి.. రాజేష్ తో పాటు ఆయన అనుచరులు రంజిత్‌మెహర్‌ (రాజోలు), యెల్లమిల్లి పండు (తూర్పుపాలెం), బోడపాటి చక్రి (తుని), వీరవల్లి ఏసుబాబు (భీమవరం), పృథ్వీరాజ్‌లపై కోనసీమ జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు రాజేష్ తో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేసారు.ఈ కేసుకు సంబంధించి మార్ఫింగ్‌ ఫొటోలపై స్పష్టత కోసం ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేశామని.. వివరాలు వచ్చాక చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసుపై రాజేశ్ మాట్లాడుతూ.. తన పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసారని, ఆ పోస్టులతో తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. మరి దర్యాప్తు చేపడితే కానీ అసలు నిజాలు బయటకు రావు.

ఇక రాజేష్ విషయానికి వస్తే.. జనసేన , పవన్ కళ్యాణ్ లకు సపోర్ట్ చేస్తూ… మహాసేన రాజేష్ గా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మద్దుతు తెలిపి, ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత..అదే పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెడుతూ జనసేన కు మద్దతు తెలుపుతూ అతి త్వరగా ఫేమస్ అయ్యాడు. జనసేన పార్టీలో చేరతారని అంత భావించారు.. కానీ చివరి నిమిషంలో టీడీపీలో చేరి షాక్ ఇచ్చాడు. టిడిపిలో చేరిన ఆయనకు అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించారు. అయితే అనూహ్యంగా ఆయనకు ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పీ గన్నవరం సీటు కేటాయించింది. అయితే రాజేష్‌కు టికెట్ రావడాన్ని కొందరు వ్యతిరేకించడం తో టికెట్ ను వెనక్కు తీసుకున్నారు. ఆ తర్వాత రాజేష్ జనసేన పార్టీపై చేసిన వ్యాఖ్యలు ఆయన్ను కూటమికి దూరం చేసాయి. అప్పటి నుండి ఈయన్ను పెద్దగా ఎవ్వరు పట్టించుకోవడం మానేశారు. సోషల్ మీడియా లో కూడా పెద్దగా కనిపించినప్పటికీ..ఈయన గురించి మాట్లాడుకోవడం తగ్గించేశారు. కానీ ఇప్పుడు ఈయనపై కేసు నమోదు కావడం తో కాస్త ఈయన పేరు మీడియాలో వినిపిస్తుంది.

Read Also : Thaman ‘Dream’ : థమన్ ‘కల’ ఎంతో గొప్పది


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • konaseema
  • Mahasena Rajesh
  • Photo Morphing case
  • police case

Related News

Konaseema Gas

కోనసీమ గ్యాస్ లీక్ తో రూ. వందల కోట్ల నష్టం?

అంబేడ్కర్ కోనసీమ (D) ఇరుసుమండలోని ONGC డ్రిల్ సైట్ నుంచి లీకవుతున్న గ్యాస్ను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటికీ 30 మీటర్ల మేర మంటలు ఎగిసిపడుతుండటంతో నిరంతరం నీటిని వెదజల్లుతున్నారు

  • Konaseema District Malikipuram ONGC Gas Leak

    కోనసీమ జిల్లాలో ఓఎన్‌జీసీ పైప్‌లైన్‌ నుంచి భారీగా గ్యాస్‌ లీక్‌

Latest News

  • సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

  • హిందీ మార్కెట్‌లోకి ఆది సాయికుమార్.. శంబాల హిట్ అవుతుందా?!

  • రోహిత్ శ‌ర్మ‌పై ప్ర‌శంస‌లు కురిపించిన ఐసీసీ చైర్మ‌న్‌!

  • టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి గుడ్ బై..

  • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

Trending News

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd