Thaman ‘Dream’ : థమన్ ‘కల’ ఎంతో గొప్పది
Thaman 'Dream' : సంగీత పాఠశాల నా కల. ఆర్థికంగా వెనుకబడిన వారికి అందులో ఉచితంగా సంగీతం నేర్పిస్తాను. సంగీతం ఉన్నచోట నేరాలు తక్కువగా ఉంటాయి
- By Sudheer Published Date - 10:56 AM, Sat - 16 November 24

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Music Director Thaman) తన కల (Dream) ను వ్యక్తం చేసి శభాష్ అనిపించుకుంటున్నాడు. ప్రపంచస్థాయి మ్యూజిక్ స్కూల్ ను ప్రారంభించాలనేది తన కల అని తెలిపి అందరి మనసు గెలుచుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (ఎస్. థమన్) తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇలా అన్ని భాషల్లో సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ సంగీత ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. థమన్ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ థమన్. 1983 నవంబర్ 16న తమిళనాడులో జన్మించాడు.
సంగీత కుటుంబంలో పుట్టిన థమన్.. చిన్న వయసు నుండి సంగీతం ఫై మక్కువ పెంచుకున్నాడు. థమన్ మొదట డ్రమ్ ప్లేయర్‌గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. 2003లో విజయ్ నటించిన “భగవతి” అనే తమిళ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. తెలుగులో “కిక్” (2009) సినిమాతో సంగీత దర్శకుడిగా బ్రేక్ అందుకొని అప్పటి నుండి వెనుకకు చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఎదిగాడు. ఏడాదికి డజన్ సినిమాలతో బిజీ గా మారాడు. మహేష్ బాబు , అల్లు అర్జున్ , రవితేజ , రామ్ చరణ్ ఇలా ఎంతోమందికి బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చి అందరి మనసులను గెల్చుకున్నాడు.
ఈరోజు థమన్ పుట్టిన రోజు సందర్బంగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన కల ను బయటకు తెలియజేసారు. ప్రపంచస్థాయి మ్యూజిక్ స్కూల్ ను ప్రారంభించాలనేది తన కల అని తమన్ తెలిపారు. ‘సంగీత పాఠశాల నా కల. ఆర్థికంగా వెనుకబడిన వారికి అందులో ఉచితంగా సంగీతం నేర్పిస్తాను. సంగీతం ఉన్నచోట నేరాలు తక్కువగా ఉంటాయి. మరో మూడేళ్లలో మన వద్దే నిర్మిస్తాను. స్థలం ఇవ్వమని కాకుండా ప్రభుత్వాలు సాయమేమైనా చేస్తాయేమో అడుగుతాను’ అని పేర్కొన్నారు. థమన్ మాటలు విన్న సంగీత ప్రియులంతా శభాష్ అంటున్నారు.
Read Also : CM Revanth Reddy : నేడు, రేపు మహారాష్ట్రలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి