HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pm Modi Condolences To Vizianagaram Train Accident

Vizianagaram Train Accident : విజయనగరం రైలు ప్రమాద ఘటన ఫై మోడీ దిగ్బ్రాంతి

మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా (Ex Gratia) ప్రకటించారు ప్రధాని మోడీ. గాయపడిన వారికి రూ. 50 వేల సాయం ప్రకటించారు.

  • Author : Sudheer Date : 30-10-2023 - 11:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vizianagaram Train Accident
Vizianagaram Train Accident

ఆదివారం విజయనగరం (Vizianagaram Train Accident) జిల్లాలో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నం-పలాస రైలు కంటకాపల్లి స్టేషన్ నుంచి బయలుదేరిన 10 నిమిషాలకు చినరావుపల్లి వద్ద మూడు లైన్లు ఉండగా మధ్య లైనులో సిగ్నల్ కోసం రైలు నిలిచింది. ఇదే క్రమంలో వెనుక కంటకాపల్లి నుంచి వస్తున్న08504 విశాఖపట్నం-రాయగఢ్ పాసెంజర్ వేగంగా ఢీకొట్టింది. దాంతో విశాఖ – పలాస వెనుక భాగంలోని రెండు భోగీలు, విశాఖ-రాయగడ్ మూడు భోగీలు ఒకదానిపై ఒకటి పడి నుజ్జునుజ్జయ్యాయి.

కొన్ని భోగీలు పక్క ట్రాక్‌పై ఆగి ఉన్న గూడ్స్ రైలుపై పడ్డాయి. ఈ పెను ప్రమాదంలో ఇప్పటి వరకూ 14 మంది మరణించగా (14 Dies), 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో 35 మంది పరిస్థితి కాస్త విషమంగా ఉందని సమాచారం. రెండు రైళ్లలో కలిపి దాదాపు 1400 మంది ప్రయాణీకులున్నట్టు సమాచారం. ప్రస్తుతం గాయపడిన వారికీ పలు హాస్పటల్స్ లలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కాగా ఈ ఘటన పట్ల ప్రధాని మోడీ (PM Modi) దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు.మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా (Ex gratia) ప్రకటించారు ప్రధాని మోడీ. గాయపడిన వారికి రూ. 50 వేల సాయం ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే సీఎం జగన్ (CM Jagan)సైతం క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించడమే కాకుండా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది సర్కార్. అలాగే రైలు ప్రమాద ఘటన ఫై చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

Read Also :  Gang Rape: 19 ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు 20 రోజులు అత్యాచారం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jagan
  • Modi Ex gratia
  • pm modi
  • Vizianagaram Train Accident

Related News

Bangladesh

బంగ్లాదేశ్‌లో కొత్త శకం.. భారత్-బంగ్లా సంబంధాలు ఎలా ఉండ‌బోతున్నాయి?!

కొత్త ప్రభుత్వం భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుందని, దీనివల్ల దక్షిణాసియా, ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల్లో మార్పు వస్తుందని భారత్ ఆశిస్తోంది.

  • Vande Mataram

    ఈ సంద‌ర్భాల్లో వందేమాత‌రం త‌ప్ప‌నిస‌రి!

  • Duvvada Jagan

    దువ్వాడ ను జగన్ మళ్లీ దగ్గరకు చేర్చుకుంటున్నాడా ?

  • Sachin Tendulkar

    అర్జున్ టెండూల్క‌ర్‌ పెళ్లికి ప్ర‌ధాని మోదీ?!

  • America

    అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన భార‌త్‌!

Latest News

  • అల్లు శిరీష్ వివాహ వేడుకలు.. మెగా- అల్లు కుటుంబాల సందడి!

  • Telangana Municipal Polls Results : మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్‌కు భారీ షాక్

  • తెలంగాణ లో కవిత జోరు మొదలైందా..? మున్సిపల్ ఫలితమే దీనికి నిదర్శనమా ?

  • తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ !

  • నల్గొండ లో హస్తం హవా.. 4 మున్సిపాలిటీలు కైవసం

Trending News

    • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

    • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

    • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

    • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

    • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd