HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pm Modi Arrives Boppudi

PM Modi Arrives Boppudi : ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికిన కూటమి శ్రేణులు

హెలిప్యాడ్ నుంచి టయోటా ఫార్చ్యూనర్ వాహనంలో మోదీ సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. మోడీ సభ వేదిక పైకి రాగానే సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది

  • Author : Sudheer Date : 17-03-2024 - 5:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi Welcome
Modi Welcome

ఏపీ అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కూటమిగా ఏర్పడిన టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) లు ఈరోజు తమ మొదటి భారీ బహిరంగ సభ ను పల్నాడు జిల్లా చిలకలూరిపేట (Chilakaluripeta) నియోజకవర్గం బొప్పూడి లో ఏర్పటు చేసారు. ‘ప్రజాగళం’ (Praja Galam) పేరుతో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ , టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లతో పాటు మూడు పార్టీల నేతలు , కార్యకర్తలు , అభిమానులు హాజరయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

కొద్దీ సేపటి క్రితం ప్రధాని మోడీ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నాలుగు హెలికాప్టర్ల కాన్వాయ్ తో మోడీ బొప్పూడికి చేరుకున్నారు. ఈ క్రమంలో మోడీకి మూడు పార్టీల నేతలు ఘన స్వాగతం పలికారు.ఇక, హెలిప్యాడ్ నుంచి టయోటా ఫార్చ్యూనర్ వాహనంలో మోదీ సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. మోడీ సభ వేదిక పైకి రాగానే సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది. జై మోడీ..జై శ్రీ రామ్ అనే నినాదాలతో ప్రజాగళం సభ మార్మోగిపోయింది. ప్రధాని మోడీ ని… చంద్రబాబు, పవన్, పురందేశ్వరి సత్కరించారు.

పదేళ్ల తర్వాత తొలిసారిగా మోడీ (Modi) , చంద్రబాబు (Chandrababu) , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు ఒకే వేదికపైకి రావడం తో పార్టీల శ్రేణుల్లో ఆనందం మాములుగా లేదు. 2014లో ఈ ముగ్గురు చేయి కలిపి ఏపీలో విజయం సాధించడం తెలిసిందే. 2019లో కూటమి విడిపోయింది. ఇప్పుడు పరిస్థితులు ఈ మూడు పార్టీలను మళ్లీ కలిపాయి. ప్రజాగళం సభతో మూడు పార్టీల కూటమి ఎన్నికల యుద్ధభేరి మోగించనుంది.

Read Also  : CM Revanth Flight Emergency Landing : సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • boppudi
  • pm modi
  • Prajagalam

Related News

President Trump

President Trump: ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. భారత్‌తో సంబంధాలను దెబ్బతీస్తుందా?!

టీవల US-India Critical and Emerging Technology Initiative (iCET) కింద ఇరు దేశాలు క్రిటికల్ మినరల్స్‌పై ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. అయినప్పటికీ ట్రంప్ భారత్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదు.

  • Zelensky

    Zelensky: భార‌త్‌కు జెలెన్‌స్కీ.. జ‌న‌వ‌రిలో వ‌చ్చే అవ‌కాశం?!

  • Rahul Gandhi

    Rahul Gandhi: లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై రాహుల్ గాంధీ చర్చ!

Latest News

  • ‎హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారా.. ఆపిల్ తొక్కలతో ఇలా చెయ్యాల్సిందే!

  • ‎రోజు కొన్ని ఉడికించిన వేరుశనగలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

  • ‎చలికాలంలో చుండ్రు పెరగడానికి కారణాలు ఇవే.. చుండ్రును తగ్గించుకోవడం కోసం ఏం చేయాలో మీకు తెలుసా?

  • ‎ఇంట్లో కుక్కని పెంచుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే!

  • పంజాబ్‌లో కబడ్డీ క్రీడాకారుడి దారుణ హత్య

Trending News

    • భారత్ వర్సెస్ సౌతాఫ్రికా 4వ టీ20.. ఎప్పుడు, ఎక్కడ ఉచితంగా చూడాలి?

    • రూ. 25,000 జీతంలో డబ్బు ఆదా చేయడం ఎలా?

    • Messi: సచిన్ టెండూల్క‌ర్‌, సునీల్‌ ఛెత్రిని కలవనున్న మెస్సీ!

    • ODI Cricket: వన్డే ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!

    • Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd