HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Flight Emergency Landing

CM Revanth Flight Emergency Landing : సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం..

ఈ సభకు హాజరైందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి తో పాటు దీపాదాస్ మున్షీ, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తదితరులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి మధ్యాహ్నం 2.30గంటకు ఫ్లైట్ నంబర్ 6e 5099 ఇండిగో విమానం ఎక్కారు

  • Author : Sudheer Date : 17-03-2024 - 5:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Revanth Reddy Flight Eme
Cm Revanth Reddy Flight Eme

సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానం (CM Revanth Flight Emergency Landing)లో సాంకేతిక లోపం (Technical Error) తలెత్తడంతో గంట నుండి ఆయన విమానంలోనే ఉండాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన రాహుల్ న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) ఈరోజు తో పూర్తి అయ్యింది. ఈ క్రమంలో ముంబై లో పెద్ద ఎత్తున భారీ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభకు హాజరారైందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి తో పాటు దీపాదాస్ మున్షీ, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తదితరులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి మధ్యాహ్నం 2.30గంటకు ఫ్లైట్ నంబర్ 6e 5099 ఇండిగో విమానం ఎక్కారు.

We’re now on WhatsApp. Click to Join.

కానీ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే మళ్లీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు పైలట్. వెంటనే అక్కడికి చేరుకున్న టెక్నికల్ టీమ్ ఇంజిన్ ఐసీయులో సమస్య తలెత్తినట్లు గుర్తించారు. ఇంజన్ వేడెక్కడంతో ఈ సమస్య వచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో గంట సేపు వరకు రేవంత్‌, భట్టి, టీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షి విమానంలోనే ఉండిపోయారు. రిపేర్ అనంతరం మళ్లీ టేకప్ అయిన విమానం ముంబైకి వెళ్ళిపోయింది. ఇక సార్వత్రిక ఎన్నికల సమరానికి విపక్ష ఇండియా కూటమి సిద్ధమైంది. నేడు ముంబయిలో జరిగే రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ముగింపు సభలో ఎన్నికల శంఖరావం పూరించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో విపక్ష ఇండియా కూటమి సమరానికి సిద్ధమైంది. దేశంలో అధికార మార్పే ప్రధాన ఎన్నికల నినాదంగా నేడు ముంబయిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఎన్డీఏ కూటమిని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష ఇండియా కూటమి ఐక్యంగా పనిచేయాలని సంకల్పించింది.

విపక్ష కూటమి బలాన్ని చాటేందుకు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభనే వేదికగా చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ భావించింది. ఇక కూటమి పార్టీలు కూడా కాంగ్రెస్​అభిప్రాయానికి జై కొట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు భారత్‌ జోడో న్యాయ్ యాత్ర ముంబయిలో ముగుస్తుండగా.. ముగింపు సభతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ సభకు ప్రాంతీయ పార్టీల దిగ్గజ నేతలను ఆహ్వానించింది. 6,700 కిలోమీటర్లపాటు సాగిన రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ముంబయిలో ముగియనున్న వేళ దానినే ఎన్నికల శంఖారావ సభకు వినియోగించుకోవాలని విపక్ష ఇండియా కూటమి నేతలు భావించారు.

Read Also : IPL 2024: సన్‌రైజర్స్ శిబిరంలో ట్రావిస్ హెడ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Cm Revanth Reddy Flight Emergency Landing
  • Shamshabad Airport
  • Technical Issue

Related News

Jeevan Reddy

Jeevan Reddy: కాంగ్రెస్‌ పార్టీకి జీవన్‌ రెడ్డి రాజీనామా

Jeevan Reddy Resigns from Congress Party  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగిత్యాలలో కార్యకర్తల సమక్షంలో తన రాజీనామా లేఖను విడుదల చేసిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ హైకమాండ్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 20 నెలలుగా పార్టీలో తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నానని, గౌరవం లేని చోట ఉండలేకే రాజ

  • Rythubharosa Money

    Rythu Bharosa : నేడే రైతు భరోసా నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి మాత్రం జమ అప్పుడే !!

Latest News

  • Mamata Banerjee: నా నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

  • Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

  • Jewar Airport : ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయానికి ప్రధాని మోడీ శ్రీకారం!

  • Special Train: రాజమండ్రి-కాకినాడ పోర్ట్ స్పెషల్ ట్రైన్: దగ్గుబాటి పురందేశ్వరి

  • వాహనదారులకు బిగ్ అలర్ట్..ఇకపై 15 రోజులకు ఓసారి పెట్రోల్ , డీజిల్ ధరల్లో మార్పులు

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd