Perni Nani : జైలుకు పంపిన సరే జగన్ వెంటే ఉంటా – పేర్ని నాని
Perni Nani : తాను ఎంతటి ఇబ్బందులకైనా సిద్ధంగా ఉన్నానని, జైలుకెళ్లాల్సి వచ్చినా కూడా జగన్(YS Jagan)ను వీడే ప్రసక్తే లేదని ధీమాగా ప్రకటించారు
- By Sudheer Published Date - 11:26 AM, Tue - 1 April 25

మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని (Perni Nani)తనపై వస్తున్న కేసులపై తీవ్రంగా స్పందించారు. కక్ష సాధింపులో భాగంగానే తమపై కేసులు పెట్టారని ఆరోపించారు. తాను ఎంతటి ఇబ్బందులకైనా సిద్ధంగా ఉన్నానని, జైలుకెళ్లాల్సి వచ్చినా కూడా జగన్(YS Jagan)ను వీడే ప్రసక్తే లేదని ధీమాగా ప్రకటించారు. మచిలీపట్నం పోలీసుల దాఖలు చేసిన తాజా పిటిషన్‌తో రేషన్ బియ్యం కుంభకోణం కేసు మరింత వేడెక్కింది.
Commercial cylinder : భారీగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
ఈ కేసులో ప్రధాన ఆరోపణలు పేర్ని నాని సతీమణి జయసుధపైనా ఉన్నాయి. మచిలీపట్నం పోలీసులు హైకోర్టును ఆశ్రయించి ఆమె బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం నడుపుతున్న రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు జరిగాయని, కోట్లాది రూపాయల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అధికారుల విచారణ కొనసాగుతోంది.
ఈ వ్యవహారంపై పేర్ని నాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను చేసిన ప్రతి పని ప్రజల కోసమేనని, కానీ కక్షపూరిత చర్యలతో తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. రాజకీయం చేస్తుంటే ఇలాంటి ఆటంకాలు సహజమేనని, తాను జగన్ వెంటే నిలిచిపోతానని స్పష్టం చేశారు. అయితే ఈ కేసు రాజకీయ పరమైనదా లేక నిజమైన అవినీతి ఆరోపణలపై ఆధారపడిందా అనే విషయాన్ని విచారణ తర్వాతే స్పష్టత వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.