Janasena : పార్టీని వీడుతున్న నేతలపై పవన్ కీలక వ్యాఖ్యలు
నేను ఎవర్నీ వదులుకోను. గుండెల్లో పెట్టుకుంటా. కానీ నన్ను కాదని వెళ్తే ఏమీ చేయలేను. నాయకులు పార్టీలోకి వస్తారు. వెళ్లిపోతారు. జనసేన, జనసైనికులు, వీరమహిళలు, పార్టీ మద్దతుదారులు.. రాష్ట్ర, ప్రజాక్షేమం కోసం నిలబడతారు
- Author : Sudheer
Date : 11-04-2024 - 9:47 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్నికల్లో భాగంగా జనసేన పార్టీ ..బిజెపి , టీడీపీ తో కలిసి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ తో పొత్తు పెట్టుకున్న దగ్గరి నుండి జనసేన నేతలు పార్టీని వీడుతూ వస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు సైతం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు వైసీపీ లో చేరడం జరిగింది. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ ఫై సంచలన ఆరోపణలు చేస్తూ వెళ్తున్నారు. తాజాగా విజయవాడ వెస్ట్ కీలక నేత మహేష్ సైతం పార్టీకి గుడ్ బై చెప్పి , జగన్ సమక్షంలో వైసీపీ లో చేరారు. ఇలా వరుసగా నేతలు పార్టీని వీడుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్..ఈరోజు అమలాపురంలో జరిగిన ప్రజాగళం సభలో కీలక వ్యాఖ్యలు చేసారు. ‘పార్టీని వీడే నాయకులకు ఒకటే చెప్తున్నా. నేను ఎవర్నీ వదులుకోను. గుండెల్లో పెట్టుకుంటా. కానీ నన్ను కాదని వెళ్తే ఏమీ చేయలేను. నాయకులు పార్టీలోకి వస్తారు. వెళ్లిపోతారు. జనసేన, జనసైనికులు, వీరమహిళలు, పార్టీ మద్దతుదారులు.. రాష్ట్ర, ప్రజాక్షేమం కోసం నిలబడతారు’ అని చెప్పుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే సందర్బంగా జగన్ ఫై పౌ విమర్శలు , ఆరోపణలు చేసారు. ‘జగన్ జీవితం జైలుకి, బెయిల్ కు మధ్య ఉందని , ఆయనది ఊగిసలాడే జీవితం అని అన్నారు. జగన్ గుర్తుపెట్టుకో .. నీకు రోజులు దగ్గరపడ్డాయి. నీ ప్రభుత్వాన్ని ప్యాక్ చేస్తాం. నిన్ను జైలుకి పంపిస్తాం అని హెచ్చరించారు. అకారణంగా మమ్మల్ని తిట్టిస్తున్నావు.. రాష్ట్రాన్ని పీల్చిపిప్పి చేస్తున్న వ్యక్తికి అండగా నిలబడే నాయకులు ఆలోచించాలి’ అని పవన్ విజ్ఞప్తి చేశారు. ఇక రాష్ట్ర భవిష్యత్తు కోసమే తాము కూటమిగా ఏర్పడినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. జగన్ను ఇక్కడి నుంచి తన్ని తరిమేస్తున్నాం. వాలంటీర్లలో కొందరే తప్పులు చేశారు. కొన్ని పండ్లు చెడిపోతే బుట్టలో మిగతా పండ్లు చెడిపోతాయి. వాలంటీర్లకు అధికారంలోకి రాగానే రూ. 10వేలు వేతనం ఇస్తాం. వారు రాజకీయాలకు అతీతంగా ఉండాలి’ అని పవన్ సూచించారు. అంతకు ముందు అంబాజీపేటలో ఏర్పటు చేసిన సభలోను జగన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. డొక్కా సీతమ్మ పుట్టిన నేల ఇదని, ప్రేమ సీమగా ఉన్న కోనసీమను జగన్ కలహాల, కొట్లాట సీమగా చేశారని మండిపడ్డారు. ఆడబిడ్దలకు రక్షణ కల్పించలేని వైసీపీ ప్రభుత్వం మనకు అవసరం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.
Read Also : DK Aruna: రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు : డీకే అరుణ