Pawan Kalyan : జ్వరం తగ్గడంతో మళ్లీ ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
జ్వరంతోనే పిఠాపురం పర్యటన కొనసాగించడంతో జ్వరం ఎక్కువ కావడం తో తదుపరి టూర్స్ కు బ్రేక్ పడ్డాయి.
- Author : Sudheer
Date : 05-04-2024 - 6:54 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల ఏమాత్రం రిస్ట్ లేకుండా ఉన్న సంగతి తెలిసిందే. పొత్తుల సమావేశాలు , ఇటు అభ్యర్థుల ఎంపిక , అసమ్మతి నేతలను బుజ్జగించడం, ప్రచార ప్లాన్స్ ఇలా అన్ని ఒక్కడే చూసుకుంటూ ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోకపోవడంతో తరుచు జ్వరం (Fever) బారినపడుతున్నారు. తాజాగా జ్వరంతోనే పిఠాపురం (Pithapuram Tour) పర్యటన కొనసాగించడంతో జ్వరం ఎక్కువ కావడం తో తదుపరి టూర్స్ కు బ్రేక్ పడ్డాయి. రెండు రోజులుగా హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటున్న పవన్..ప్రస్తుతం జ్వరం నుండి బయటపడ్డారు. దీంతో తన ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఏప్రిల్ 7 నుంచి పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి యాత్ర ఉత్తరాంధ్రలో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7వ తేదీన (ఆదివారం) అనకాపల్లి, 8న ఎలమంచిలిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇక 9న పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొనబోతున్నట్లు పార్టీ తెలిపింది. ఆ తరువాత జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నెల్లిమర్ల, అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పిఠాపురం తర్వాత ఆయన తెనాలిలో ప్రచారం చేయాల్సి ఉంది. ఉత్తరాంధ్ర పర్యటన తర్వాత తెనాలి సభలో ప్రసంగించే అవకాశం ఉంది.
Read Also : AP : సంజన, సుకన్య అంటూ పరితపించే నేతలు వైసీపీలో ఉన్నారు – 30 ఇయర్స్ పృద్వి