AP : సంజన, సుకన్య అంటూ పరితపించే నేతలు వైసీపీలో ఉన్నారు – 30 ఇయర్స్ పృద్వి
శుక్రవారం ఉండవల్లిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ని పృథ్వీరాజ్ కలిశారు
- Author : Sudheer
Date : 05-04-2024 - 6:40 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న తరుణంలో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పార్టీల అధినేతలు కాదు ..పార్టీ నేతలు సైతం ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నారు. తాజాగా జనసేన నేత 30 ఇయర్స్ ఫృథ్వీ (30 Years Prudhvi) వైసీపీ పార్టీ (YCP Party) నేతలపై కీలక వ్యాఖ్యలు చేసారు. సంజన, సుకన్య అంటూ పరితపించే నేతలే వైసీపీ లో ఉన్నారన్నారు. శుక్రవారం ఉండవల్లిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ని పృథ్వీరాజ్ కలిశారు. టిడిపి- జనసేన – బీజేపీ ఉమ్మడిగా ఈ ఎన్నికల్లో రూపొందించాల్సిన ప్రచార కార్యక్రమాలపై పృద్వి తో..లోకేష్ చర్చించారు.
We’re now on WhatsApp. Click to Join.
అనంతరం పృథ్వీరాజ్ మాట్లాడుతూ… ఏ సర్వే చూసినా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధ్బుత విజయం ఖాయమని స్పష్టమవుతోందని, పులివెందుల రెడ్లే ఈసారి జగన్ గెలవడం కష్టమని చెబుతున్నారని అన్నారు. గత ఎన్నికల సమయంలో వైసీపీలో ఉన్నప్పుడు తన చిప్ సరిగా పనిచేయక టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్‌లపై విమర్శలు చేశానని అందుకు క్షమాపణలు కూడా చెప్పానని మరోసారి పృద్వి గుర్తు చేసారు. తనకు కరోనా వచ్చినప్పుడు బెడ్ అవసరమైతే అధికారంలో ఉన్న వైసీపీ పట్టించుకోలేదని కానీ మెగా బ్రదర్స్ బెడ్ ఏర్పాటు చేయిస్తే బతికి బయటపడ్డానని..వారి సహాయాన్ని ఎప్పటికి మరువలేనని పృద్వి ఎమోషనల్ అయ్యారు. తానో సినిమాలో డాన్స్ చేస్తే సంబరాల మంత్రి( అంబటి రాంబాబుని ఉద్దేశించి..) తట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. సంజన, సుకన్య అంటూ పరితపించే ప్రజా ప్రతినిధులు వైసీపీలో ఉన్నారని సెటైర్లు వేశారు.
Read Also : Delhi Liquor Scam : ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చిన కోర్ట్