Warning : పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తాం – వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్
Warning : గత ప్రభుత్వ హయాంలో చేసిన అరాచకాలను ఇప్పుడు కూడా కొనసాగించాలని వైసీపీ నేతలు చూస్తున్నారని అన్నారు. ఆలా చేయాలనీ చూసిన, పిచ్చి పిచ్చి వేషాలు వేసిన తొక్కి నార తీస్తా” అంటూ పవన్ హెచ్చరించారు
- By Sudheer Published Date - 07:36 PM, Mon - 23 June 25

ఆంధ్రప్రదేశ్(AP)లో కూటమి ప్రభుత్వం (Kutami Govt) ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతిలో “సుపరిపాలనలో తొలి అడుగు” (Suparipalanalo Toli Adugu Public Meeting) పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వైసీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అరాచకాలను ఇప్పుడు కూడా కొనసాగించాలని వైసీపీ నేతలు చూస్తున్నారని అన్నారు. ఆలా చేయాలనీ చూసిన, పిచ్చి పిచ్చి వేషాలు వేసిన తొక్కి నార తీస్తా” అంటూ పవన్ హెచ్చరించారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించదని, చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
Telangana High Court: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్
వైసీపీ పాలనలో అధికారులే భయంతో పని చేయలేని పరిస్థితి నెలకొని ఉందన్నారు. తాను విశాఖపట్నంలో కూడా నిర్బంధితుడిని అయినట్లు గుర్తుచేశారు. తన కుటుంబ సభ్యులను ఆరోపించడమేగాక, బూతులు, బెదిరింపులతో ప్రజాస్వామ్యాన్ని లాంఛనపాలుచేసారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాకపోయి ఉంటే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడం కూడా కష్టం అన్నారు. ప్రజల ఆశల్ని నిలబెట్టేందుకు తాము ఏకమయ్యామని అన్నారు.
సీఎం చంద్రబాబు ఇచ్చిన విజన్‌ను వల్లే పెన్షన్ల పెంపు, దీపం పథకం, తల్లికి వందనం వంటి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా 16 వేల టీచర్ పోస్టుల భర్తీ చేపట్టిందని, అలాగే పోలీసు శాఖలో 6,100 ఉద్యోగాల నియామకం జరుపుతున్నట్టు చెప్పారు. ప్రజలకు ఉచిత ఇసుక అందిస్తూ నిర్మాణ రంగానికి ఊపునిస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం మీద, కూటమి పాలన ప్రజల మద్దతుతో నిలబడుతోందని పవన్ స్పష్టం చేశారు.