Pawan Kalyan : పిఠాపురం నుంచే విజయకేతనం – పవన్ కళ్యాణ్
'క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయబోతున్నాం. కొత్త ఏడాది ప్రజలకు మేలు చేయాలి. మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలి
- By Sudheer Published Date - 05:31 PM, Tue - 9 April 24

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన మకాం ను పూర్తిగా ఏపీకి మార్చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా ఏపీలోనే ఉండాలని..రాబోయే రోజుల్లో కూడా ఏపీలోనే ఉండాలనే ఉద్దేశ్యం తో తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈరోజు ఉగాది (Ugadi) సందర్బంగా కొత్త ఇంట్లో పూజలు చేసి ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇదే సందర్బంగా కొత్త ఇంట్లో ఉగాది సంబరాలను జరుపుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రజలంతా బాగుండాలని భగవంతుడిని కోరుకున్నట్లు ఉగాది వేడుకల్లో పాల్గొన్న అనంతరం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ‘క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయబోతున్నాం. కొత్త ఏడాది ప్రజలకు మేలు చేయాలి. మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలి. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు రావాలి. రైతులకు మేలు జరగాలి’ అని ఆకాంక్షించారు. రెండేళ్ల క్రితమే స్ధానికంగా ఉంటున్న ఓడూరి నాగేశ్వరరావు కుటుంబం తనను పిఠాపురంలో పోటీ చేయాలని కోరిందన్నారు. అయితే అప్పట్లో ఆలోచించలేదన్నారు. ఆ తర్వాత తనను ఇంతమంది ఆహ్వానిస్తుంటే పోటీకి నిర్ణయం తీసుకున్నామన్నారు.
Read Also : Pawan Kalyan : ‘ఎప్పటికీ మారని మనిషి’ అంటూ పవన్ ఫై స్పెషల్ వీడియో