బీమ్లా నాయక్ స్థానిక బలం..ఇక ప్రజల మధ్యకు కాటమరాయుడు
ఏపీలో స్థానిక ఫలితాలను ఎవరికి అనుకూలంగా వాళ్లు మలచుకుంటున్నారు. రాష్ట్రంలో అతి పెద్ద రెండో పార్టీగా జనసేన అవతరించినట్టు అంచనా వేస్తున్నారు. సాధారణ ఎన్నికల కంటే ఓటు శాతం అనూహ్యంగా పెరిగిందని జనసేనాని భావిస్తున్నాడు.
- By Hashtag U Published Date - 12:59 PM, Fri - 24 September 21

ఏపీలో స్థానిక ఫలితాలను ఎవరికి అనుకూలంగా వాళ్లు మలచుకుంటున్నారు. రాష్ట్రంలో అతి పెద్ద రెండో పార్టీగా జనసేన అవతరించినట్టు అంచనా వేస్తున్నారు. సాధారణ ఎన్నికల కంటే ఓటు శాతం అనూహ్యంగా పెరిగిందని జనసేనాని భావిస్తున్నాడు. సుమారు 25.2శాతం ఓట్లను స్థానిక ఎన్నికల్లో జనసేన పొందిందని వెల్లడించారు.
రాష్ట్రంలో దరిద్రపు, దాష్టీక పాలన కొనసాగుతోందని పవన్ ఆగ్రహిస్తూ ప్రకటన విడుదల చేశారు. సుపరిపాలన అందిస్తారని ఆశించినట్టు పవన్ చెబుతున్నాడు. 151 మంది ఎమ్మెల్యేలతో పటిష్టమైన ప్రభుత్వం ఏపీలో ఏర్పడింది. కానీ, అందుకు తగిన విధంగా పరిపాలన లేదని పవన్ భావిస్తున్నాడు. ఓట్ల లెక్కింపు సమయంలో గెలుపును తారుమారు చేశారని ఆరోపించారు. ఇలాగైతే, చూస్తూ ఉండబోమని హెచ్చరించాడు. అవసరమైతే క్షేత్రస్థాయి పోరాటాలకు దిగుతామని వార్నింగ్ ఇచ్చాడు.
జగన్ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇస్తామని తొలుత పవన్ చెప్పాడు. ఆ తరువాత కరోనా కారణంగా రెండున్నరేళ్లు గడిచింది. అయినప్పటికీ పవన్ చెప్పిన మేరకు ఏపీ సర్కార్ మీద పోరాటాలకు దిగలేదు. ఇప్పుడు ఇక పోరాటాలకు దిగుతామని పవన్ తన ప్రకటనలో హెచ్చరించాడు. ప్రతి నెలా జనసేనలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని చెప్పారు. రాబోవు రోజుల్లో పర్యటనకు సిద్ధం అవుతామని స్పష్టం చేశారు. సో..ఇక నుంచి జనసేన మళ్లీ జనంలోకి వెళ్లనుందన్నమాట.
స్థానిక ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. ఆ ఎన్నికలను బహిష్కరించింది. ఆ క్రమంలో జనసేనకు ఓట్ల శాతం పెరిగిందా? లేక నిజంగా ఆ పార్టీ బలం పుంజుకుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోగా, డిపాజిట్లు గల్లంతు అయిన విషయం తెలిసిందే. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసినప్పటికీ డిపాజిట్లు కూడా లభించలేదు. ఆ లోపుగానే స్థానిక ఎన్నికల్లో 25శాతం ఓటు బ్యాంకు ఎక్కడ నుంచి వచ్చిందనేది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు జనసేనలు మాత్రం చెప్పగలవు. మిగిలిన వాళ్లకు అర్థంకాని ప్రశ్న. స్థానిక ఎన్నికల ఫలితాల బలాన్ని చూసుకుని దూసుకెళ్లడానికి బీమ్లానాయక్ ప్రివ్యూ తయారు చేశాడు. అది జనరంజకమా? కాదా? అనేది భవిష్యత్ నిర్ణయించాలి.
Related News

Chandrababu – Pawan Kalyan : చంద్రబాబు ను కలిసిన పవన్ కళ్యాణ్
బుధువారం హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఇద్దరు ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించినట్టు సమాచారం