HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Reciew On Swachandra Corporation

Pawan Kalyan : స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్‌ రికార్డ్స్ లో లేని రూ.1,066 కోట్లు

అయిదేళ్ళలో కేంద్రం నుంచి వెయ్యి కోట్లకు పైగా వచ్చినట్లు గుర్తించారు. ఈ నిధులు ఎక్కడకు పోయాయని అధికారులను ప్రశ్నించారు

  • By Sudheer Published Date - 06:34 PM, Wed - 26 June 24
  • daily-hunt
Pawanreview

ఉపముఖ్యమంత్రి తో పాటు పలుశాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి కూడా పవన్ (Pawan Kalyan) బిజీ బిజీ గా ఉన్నారు. ఓ పక్క ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే..మరోపక్క వాటిని తీర్చేందుకు అధికారులతో మాట్లాడుతున్నారు. అలాగే రాష్ట్ర వ్యపేతమగు ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తు వాటిని ఎలా పరిష్కరించాలో తెలియజేస్తున్నారు. బుధవారం ఆయన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ( Swachandra Corporation)పై సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశానికి ఉన్నతాధికారులతో పాటు ఇంజనీర్లు కూడా హాజరయ్యారు. కార్పొరేషన్ తీరుతెన్నులపై డిప్యూటీ సీఎంకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం, ఆయన స్వచ్ఛాంధ్రకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలపై ఆరా తీశారు. అయిదేళ్ళలో కేంద్రం నుంచి వెయ్యి కోట్లకు పైగా వచ్చినట్లు గుర్తించారు. ఈ నిధులు ఎక్కడకు పోయాయని అధికారులను ప్రశ్నించారు. ప్రస్తుతం
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో మిగిల్చింది రూ.7 కోట్లు మాత్రమే అని అధికారులు చెప్పడం తో ఓకేంత షాక్ అయ్యారు పవన్. ఈ డబ్బు కేవలం అయిదు నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయి అన్నారు.

• 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2092 కోట్లు నిధి ఉంటే… ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?
• కార్పొరేషన్ నిధులు ఎటు మళ్లించారు? అని ప్రశ్నించారు.

2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో రూ.2092.65 కోట్ల నిధులు ఉంటే ప్రస్తుతం కేవలం రూ.7 కోట్లు మాత్రమే మిగిల్చారా అని పవన్ కళ్యాణ్ విస్తుపోయారు. గత ప్రభుత్వ పాలన సమయంలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు అంశంపై చర్చించారు. 2020-21లో రూ.728.35 కోట్లు మాత్రమే ఈ కార్పొరేషన్ వినియోగించింది. 2021-22లో రూ.508 కోట్లు ఖర్చు చేశారు. ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.1066.36 కోట్లు ఖాతాలో ఉన్నాయి. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యేనాటి కార్పొరేషన్ ఖాతాలో రూ.3 కోట్లు మాత్రమే ఉన్నాయని రికార్డుల్లో నమోదు అయింది. దీనిపై వివరణ ఇవ్వాలని, నిధులు ఎటు వెళ్ళాయి, ఏం చేశారో సవివరంగా పేర్కొనాలని ఉప ముఖ్యమంత్రివర్యులు అధికారులను ఆదేశించారు. ఆ ఆర్థిక సంవత్సరంలో కేంధ్ర ప్రభుత్వం నుంచి రూ.70 కోట్లు నిధులు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు నిధులు అందించింది. రూ.46 కోట్లు ఖర్చు చేసింది. 2023-24లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, వాటిపై వచ్చిన వడ్డీతో రూ.239 కోట్లు నిధులు సమకూరాయి. ఖర్చు రూ.209 కోట్లు మేర చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ మిగిలినవి రూ.7.04 కోట్లు మాత్రమే. స్వచ్ఛాంధ్ర నిధులనూ వదల్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు సక్రమంగా వినియోగమయితేనే ఈ సంస్థకు నిర్దేశించిన లక్ష్యాలు అందుకోగలమని ఉపముఖ్యమంత్రివర్యులు స్పష్టం చేశారు. దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సదుద్దేశంతో, ప్రజారోగ్యం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకువచ్చారని అందులో భాగంగానే స్వచ్ఛాంధ్ర ఏర్పాటైందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులను నెలల తరబడి బ్యాంకు ఖాతాల్లో ఉంచడం, ఆ నిధుల ద్వారా వడ్డీ కూడా లభిస్తున్నా వినియోగించకుండా- ఆపైన ఇతర అవసరాలకు మళ్లించడం అనేది గత ప్రభుత్వ పాలకులు చేసిన ఓ దురదృష్టకర ప్రక్రియ అని పవన్ తెలిపారు. అందుకు 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఆయ్యేనాటికి కార్పొరేషన్ ఖాతాలో కేవలం రూ.3 కోట్లు మిగల్చడమే ఉదాహరణ అన్నారు. దీన్నిబట్టే వైసీపీ పాలకులు నిధుల మళ్లింపు ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోందన్నారు.

2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2092 కోట్లు నిధి ఉంటే… ఇప్పుడు జీతాలకు సరిపడా నిధులు మాత్రమే ఖాతాలో ఉండే పరిస్థితి ఎందుకు వచ్చింది? అని అధికారులను ప్రశ్నించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లో నిధుల మళ్లింపుపై మరింత లోతుగా సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. నిధులు ఎటు మళ్లించారో, ఎవరి ఆదేశాలతో ఆ పని చేశారో కూడా తెలియచేయాలని, గత అయిదేళ్లలో ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా చర్చిద్దామని అధికారులకు ఉప ముఖ్యమంత్రివర్యులు స్పష్టం చేశారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఈ రోజు స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. pic.twitter.com/mfap5xfUMO

— JanaSena Party (@JanaSenaParty) June 26, 2024

Read Also : Kangana-Chirag: పార్లమెంట్ సాక్షిగా కంగనా, చిరాగ్ పాశ్వాన్ వీడియో వైరల్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Pawan Kalyan
  • Swachandra Corporation

Related News

Dasara Celebrations

Dasara Celebrations : అంబరాన్నంటిన దసరా సంబరాలు

Dasara Celebrations : ప్రత్యేకంగా తెలంగాణలోని వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానం దసరా ఉత్సవాలకు వేదికగా మారింది. అక్కడ నిర్వహించిన భారీ స్థాయి వేడుకలు ప్రజలను ఆకట్టుకున్నాయి

  • Og Kiss Song

    OG Item Update : పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘OG’లో స్పెషల్ సాంగ్

  • Ap Gst

    GST : GST లాభాలపై రాష్ట్రవ్యాప్త ప్రచారం – సీఎం చంద్రబాబు

  • Ntr Bharosa Pension Scheme

    AP Govt : పెన్షన్ల పంపిణీకి రూ. 2745 కోట్లు విడుదల

  • Ycp

    YCP Sainyam : నియోజకవర్గానికి 8000 మందితో YCP సైన్యం

Latest News

  • Prashant Kishore : మోదీ, రాహుల్ గాంధీ ఎవరూ కూడా తన నుంచి రేవంత్ రెడ్డిని కాపాడలేరన్నారు.!

  • Kantara Chapter 1 : ‘కాంతార ఛాప్టర్-1’కు తొలి రోజు భారీ కలెక్షన్స్!

  • Vladimir Putin : అమెరికాకు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం వార్నింగ్ ఇచ్చారు.!

  • Bomb Threat : సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు

  • Rains : అల్లకల్లోలంగా శ్రీకాకుళం

Trending News

    • Social Media: ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. సోష‌ల్ మీడియాపై మంత్రుల‌తో క‌మిటీ!

    • Youngest Billionaire: భారతదేశంలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ ఇత‌నే.. సంపాద‌న ఎంతంటే?

    • Ramreddy Damodar Reddy: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత.. ఆయ‌న రాజ‌కీయ జీవిత‌మిదే!

    • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

    • Vijayadashami: రేపే దసరా.. విజయదశమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd