Kangana-Chirag: పార్లమెంట్ సాక్షిగా కంగనా, చిరాగ్ పాశ్వాన్ వీడియో వైరల్
పార్లమెంట్ వేదికగా కంగనా, చిరాగ్‌ల వీడియో వైరల్ అవుతోంది. పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలో కంగనా, చిరాగ్ ఒకరినొకరు కౌగిలించుకోవడం వీడియోలో చూడవచ్చు. ఆ తర్వాత ఎంపీలిద్దరూ చేతులు పట్టుకుని పార్లమెంట్ లోపలికి వెళ్లారు.
- By Praveen Aluthuru Published Date - 05:48 PM, Wed - 26 June 24

Kangana-Chirag: లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపీ చిరాగ్ పాశ్వాన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ల కెమిస్ట్రీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇప్పటికే వీరిద్దరికి సంబందించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మాధ్యమాలలో చక్కర్లు కొడుతుండగా తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వీరిద్దరూ 13 ఏళ్ళ క్రితం ఓ బాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. ఇప్పుడు వీరిద్దరూ ఎన్నికల్లో గెలిచి ఇద్దరూ పార్లమెంటుకు ఎంపికయ్యారు. అయితే పార్లమెంట్ ఆవరణలో వీరి మధ్య ఉన్న స్నేహం కారణంగా ఫోటోలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
ఈ రోజు పార్లమెంట్ వేదికగా కంగనా, చిరాగ్‌ల వీడియో వైరల్ అవుతోంది. పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలో కంగనా, చిరాగ్ ఒకరినొకరు కౌగిలించుకోవడం వీడియోలో చూడవచ్చు. ఆ తర్వాత ఎంపీలిద్దరూ చేతులు పట్టుకుని పార్లమెంట్ లోపలికి వెళ్లారు. సోషల్ మీడియాలో వీడియోకు విపరీతమైన స్పందన వస్తోంది. చాలా మంది నెటిజన్లు ఇద్దరు ఎంపీల మధ్య రొమాంటిక్ యాంగిల్‌ను కూడా హైలేట్ చేస్తున్నారు.
#WATCH | Union Minister Chirag Paswan and BJP MP Kangana Ranaut arrive at the Parliament. pic.twitter.com/ZZZk61z7d0
— ANI (@ANI) June 26, 2024
చిరాగ్ పాశ్వాన్ తన తొలి చిత్రంలో కంగనా రనౌత్‌తో కలిసి పనిచేశాడు. 13 ఏళ్ల క్రితం వీరిద్దరి ‘మిలే నమిలే హమ్’ సినిమా విడుదలైంది. ఇందులో కంగనా కథానాయిక. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాబట్టలేకపోయింది. అయితే వీరిద్దరి కెమిస్ట్రీకి బాగానే మార్కులు పడ్డాయి.
Also Read: Final Match: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఏ జట్లు ఫైనల్‌కు వెళ్తాయో తెలుసా..?