HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Planning New Political Strategies

PK and TDP: పవన్ మైండ్ సెట్ లో మార్పు… టీడీపీ కి గుడ్ బై!

దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. అక్కడ జరిగే ప్రతి ఎన్నికలోనూ కులరాజకీయాలే గెలుపోటములను డిసైడ్ చేస్తాయి. అందుకే రాజకీయ నేతలంతా కూడా కలు రాజకీయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు.

  • Author : Hashtag U Date : 23-01-2022 - 11:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan Imresizer (1)
Pawan Kalyan Imresizer (1)

దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. అక్కడ జరిగే ప్రతి ఎన్నికలోనూ కులరాజకీయాలే గెలుపోటములను డిసైడ్ చేస్తాయి. అందుకే రాజకీయ నేతలంతా కూడా కలు రాజకీయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక ఇదంతా పక్కన బెడితే.. ఏపీ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ప్రత్యేక స్థానముంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని పార్టీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినపోయినా కూడా… ప్రధాన పార్టీల గెలుపోటములను మాత్రం బాగా ప్రభావితం చేసింది. పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా కూడా… దాదాపు 40 సీట్లలో జనసేన వల్లే ఫలితాలు రివర్స్ అయ్యాయనేది విశ్లేషకుల మాట. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తుకోసం తెలుగు దేశం పార్టీ తహతహలాడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చారు. వన్ సైడ్ లవ్ అంటూ… పవన్ పై తనకున్న అభిమానాన్ని బయటపెట్టుకున్నారు. అయితే ఒకానొక దశలో జనసేనాని పవన్ సైతం టీడీపీతో పొత్తుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలు చక్కర్లుకొట్టాయి. కానీ, ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిణామాలను గమనించిన పవన్… తెలుగు దేశం పార్టీతో పొత్తు విషయంలో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. అదే… ఇటీవల హైదరాబాద్ లోని కోహినూర్ హోటల్ లో జరిగిన కాపు నేతల సమావేశం.

గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో హైదరాబాద్ లోని కోహినూర్ హోటల్ లో కాపు సామాజిక వర్గానికి చెందిన అతి ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, దాసరి రాము తో పాటు పలువురు ముఖ్యనేతల హాజరయ్యారు. ఈ సమావేశంలో వారంతా కూడా సుదీర్ఘంగా చర్చించిన అనంతరం, కాపు నేతనే ముఖ్యమంత్రిని చేయాలని తీర్మానించుకున్నారని సమాచారం. ఈ లిస్టులో పవన్ కల్యాణ్ కి గుడ్డిగానైనా సపోర్ట్ చేయాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. ఎందుకంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గం నుంచి చూస్తే… పవన్ ని మించిన ఛరిస్మా కానీ, ఫాలోయింగ్ కానీ ఉన్న నేత మరొకరు లేరు. ఒకవేళ పవన్ కాకపోతే… బీజేపీ నుంచి అభ్యర్థిని లేదా కొత్త పార్టీ అయినా… పెట్టాలన్న ఆలోచన సైతం చేసినట్లు టాక్. మరోవైపు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా కాపులకు రాజ్యాధికారం రావాలంటూ బీసీ, ఎస్సీ నేతలతో సమావేశాలు పెడుతున్నారు. వీటన్నిటీ దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశం పార్టీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీకి బీజేపీ తో ఉన్న స్నేహాన్ని కొనసాగిస్తూనే.. కాపు నేతలను కలుపుకుపోతేనే మంచిది అనే నిర్ణయానికి జనసేనాని వచ్చినట్లు విశ్వననీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. అయితే… ఈ అంశాలన్నిటీని పక్కనబెడితే… వచ్చే ఎన్నికల నాటికి అప్పటి సమీకరణాలు, పరిస్థితులను బట్టి టీడీపీతో పొత్తు పెట్టుకోవచ్చా…? లేదా..? అనేది తేల్చుకోవచ్చని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. జనసేన పార్టీ 2014 లో తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి సహకరించింది. ఎప్పుడైతే తెలుగుదేశంతో విభేదించారో.. ఆ తర్వాత ఆ పార్టీ నేతలు పవన్ పై ఓ రేంజ్ లో దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు నాయిడు నుంచి మొదలుకుని గల్లీ లీడర్ వరకు పవన్ కల్యాణ్ ను విమర్శించారు. ఇక టీడీపీ కి చెందిన సోషల్ మీడియాలో అయితే ఎలాంటి దుస్ప్రచారం చేశారో మనం చూశాం.

ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టీడీపీపై రగిలిపోయారు. అందుకే గత ఎన్నికల్లో పవన్ పై అభిమానం ఉన్నా కూడా… టీడీపీ పై, చంద్రబాబు పై ఉన్న వ్యతిరేకతతో వైసీపీ కి సపోర్ట్ చేసి ఆపార్టీకి పట్టం కట్టారు. అలాంటిది ఇప్పుడు తెలుగు దేశం పార్టీతో పొత్తు అంటే జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు అంగీకరించే పరిస్థితి లేదు. అంతేకాదు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే… పవన్ కళ్యాణ్ ఎలా ముఖ్యమంత్రి అవుతారని కూడా కొందరు ఫ్యాన్స్ వాదిస్తున్నారు. ఎందుకంటే… ఇటీవల చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాల్లో తన సతీమణి పై వైసీపీ నేతలు అవమానకర వ్యాఖ్యలు చేశారని… ఇకపై మళ్లీ శాసన సభలో అడుగుపెడితే సీఎంగానే అడుగుపెడతానని ఆయన సపదం చేశారు. వీటన్నిటినీ పవర్ స్టార్ అభిమానులు గమనిస్తూనే ఉన్నారు. ఐతే ఇటీవల జనసేనాని పవన్ నిర్వహించిన పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా పొత్తులపై కార్యకర్తల అభీష్టం మేరకే ముందుకు వెళదామని పవన్ ప్రకటించారు. ఈ స్టేట్మెంట్ తో జసనేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తుందా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • alliance
  • andhra pradesh politics
  • elections strategies
  • Jana Sena
  • kapu leaders
  • Nara Chandra babu Naidu
  • Pawan Kalyan
  • tdp

Related News

GODAVARI PUSHKARALU REVIEW

AP : గోదావరి పుష్కరాలు-2027పై సీఎం చంద్రబాబు సమీక్ష ..త్వరలో పుష్కర లోగో విడుదల

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, చారిత్రక వైభవం ఉట్టిపడేలా… మరింత ఆకర్షణీయంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి సమీప ప్రాంతాల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నందున పుష్కరాల్లో ఆధ్యాత్మిక పర్యాటకానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులతో ఆర్ధిక కార్యకలాపాలు ప

    Latest News

    • Health Care Tips: వర్షాకాలంలో రోగాలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి!

    • Depression: డిప్రెషన్ తగ్గించు కోవడానికి ఏం చేయాలి? మనమే తగ్గించుకోవచ్చు.

    • Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

    • LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!

    • Arjun Tendulkar: కొడుకు అర్జున్‌ ప్రదర్శనపై సచిన్‌ ప్రశంసల జల్లు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd