AP Polls : ఏ కలలు నిజం చేసాడని జగన్ కు ఓటు వేయాలి..? పవన్ సూటి ప్రశ్నలు
కలలు నిజం చేయడానికి అంట… మెగా డీఎస్సీ ఇచ్చి మీ కలలు నిజం చేశాడా? ఉపాధి అవకాశాలు కల్పించాడా? ఎస్టీ సబ్ ప్లాన్ ఇచ్చాడా ? అంటూ ప్రశ్నించారు
- Author : Sudheer
Date : 02-05-2024 - 11:09 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ ఎన్నికల ప్రచారంలో పవన్ (Pawan) దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు..పూర్తిగా ఎన్నికల ఊపును తన వైపు తిప్పుకున్నాడు. గత నెల క్రితం వరకు వైసీపీ ప్రచారం ఊపు కనిపించగా..ఆ తర్వాత నుండి కూటమి తన ప్రచార హోరు చూపించడం మొదలుపెట్టింది. నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత మరింత స్పీడ్ చేసింది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ఓ పక్క శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ..మరోపక్క అధికార పార్టీ నేతల్లో చెమటలు పట్టిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు ఉత్తరాంధ్ర లో ప్రచారం చేసాడు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ(Paalakonda)లో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో సీఎం జగన్ కు వరుస ప్రశ్నలు సంధించారు. హోర్డింగ్ పై జగన్ బొమ్మతో పాటు కలలు నిజం చేయడానికి… జగన్ కోసం సిద్ధం అని రాసి ఉంది. దానిపై స్పందిస్తూ..కలలు నిజం చేయడానికి అంట… మెగా డీఎస్సీ ఇచ్చి మీ కలలు నిజం చేశాడా? ఉపాధి అవకాశాలు కల్పించాడా? ఎస్టీ సబ్ ప్లాన్ ఇచ్చాడా ? అంటూ ప్రశ్నించారు. ఇక్కడ కోడి రామ్మూర్తి స్ఫూర్తి ఉన్న యువత ఉన్నారు… కానీ జగన్ కానీ, ఇక్కడున్న వైసీపీ నేతలు కానీ యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి అని అడిగారా? అని ప్రశ్నించారు.
ఇదే సందర్బంగా కూటమి అధికారంలో రాగానే..మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే (Mega DSC) చేస్తామని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు. సీపీఎస్‌కు పరిష్కార మార్గం చూపిస్తామని.. దానికి సమానమైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని ..గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని మాటిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక.. ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
Read Also : Revanth Reddy : మామ..అల్లుళ్ల నుండి సిద్దిపేటకు విముక్తి కలిగించాలి