Pawan With Balakrishna: బాలయ్య తో పవన్ కళ్యాణ్.. ఓటు చీలుపై చర్చ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నందమూరి బాలయ్య ను ప్రత్యేకంగా కలుసుకున్నారు.
- Author : Balu J
Date : 24-12-2022 - 11:08 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA), సీనిహీరో నందమూరి బాలకృష్ణను, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కలుసుకున్నారు. శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో 20 నిమిషాలపాటు జరిగిన భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పవన్ (Pawan Kalyan), బాలకృష్ణ వరుసగా ‘హరి హర వీర మల్లు’ ‘వీరసింహా రెడ్డి’ చిత్రాల షూటింగ్‌లు ప్రక్కనే జరుగుతుండటంతో పవన్ బాలయ్యను కలుసుకున్నారు. కొంత సమయం తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులతోపాటు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.
ఏపీ అధికార వ్యతిరేక ఓట్లను చీల్చడానికి అనుమతించనని, తాను గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని ఇటీవల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ సమావేశానికి ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది. అయితే వారి మధ్య పొత్తుకు సంబంధించి ఏదైనా చర్చ జరిగిందా లేదా అనేది తెలియదు. అల్లు అరవింద్‌కి చెందిన ఆహా OTT ప్లాట్‌ఫామ్‌లో బాలకృష్ణ టాక్ షోను హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.