Pawan Meets CBN : చంద్రబాబు- పవన్ కళ్యాణ్ ల భేటీలో ప్రధానంగా చర్చించిన అంశాలు ఇవే..
ఈ సమావేశంలో ప్రధానంగా క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు ఏవిధంగా చేయాలి..? సీఐడీ వరుసగా చంద్రబాబుపై పెడుతున్న కేసులఫై... ఆంధ్ర, తెలంగాణ రాజకీయాలపై ఇరువురు మాట్లాడినట్లు తెలుస్తుంది
- By Sudheer Published Date - 07:55 PM, Sat - 4 November 23

స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development Case)లో మధ్యంతర బెయిల్ (Bail) ఫై బయటకు వచ్చిన మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తో జనసేన అధినేత భేటీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి , రాజకీయ అంశాల గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వెంట జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Manohar) ఉండగా.. చంద్రబాబు వెంట ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఉన్నారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సమావేశంలో ప్రధానంగా క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు ఏవిధంగా చేయాలి..? సీఐడీ వరుసగా చంద్రబాబుపై పెడుతున్న కేసులఫై… ఆంధ్ర, తెలంగాణ రాజకీయాలపై ఇరువురు మాట్లాడినట్లు తెలుస్తుంది. అలాగే రెండు పక్షాలు కలిసి మేనిఫెస్టో విడుదల, క్షేత్ర స్థాయి పోరాటాలు వంటి అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ వైఖరిపై కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు వినికిడి. బీజేపీ పార్టీతో భవిష్యత్‌లో ఎలా కలిసి ముందుకు వెళ్లాలనే అంశంపై కూడా ఈ సమావేశంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించినట్లు సమాచారం. కామన్ మినిమమ్ ప్రోగ్రాం రూపకల్పన మీద కూడా చర్చించినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కరువు, ధరల పెరుగుదల, కరెంట్ ఛార్జీల పెంపు, మద్యం, ఇసుక కుంభకోణాల వంటి అంశాల్లో క్షేత్ర స్థాయి పోరాటాలు చేపట్టాలని టీడీపీ- జనసేన పార్టీలు చూస్తున్నాయి.
ఇక రాజమండ్రి జైల్లో ములాఖత్ లో చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిసిన సంగతి తెలిసిందే. ఆ రోజే టీడీపీ – జనసేన పొత్తుపై పవన్ కల్యాణ్ ప్రకటన చేయడం జరిగింది. రీసెంట్ గా పవన్ కల్యాణ్, లోకేశ్ లురాజమండ్రి లో టీడీపీ – జనసేన రాజకీయ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇక ఇప్పుడు చంద్రబాబు తో పవన్ భేటీ అయ్యారు.
Read Also : BSP 3rd List : బీఎస్పీ మూడో జాబితా విడుదల