Pawan Kalyan: అక్రమ నిర్బంధాలకు జనసేన వెరవదు!
ఏపీలో పొలిటికల్ హీట్ పెంచిన పవన్ కల్యాణ్, కొన్ని రోజుల గ్యాప్ తర్వాత పొలిటికల్ పంచ్ డైలాగులతో మరింత సెగలు రేపుతున్నారు.
- By Balu J Published Date - 08:47 PM, Sun - 30 October 22

ఏపీలో పొలిటికల్ హీట్ పెంచిన పవన్ కల్యాణ్, కొన్ని రోజుల గ్యాప్ తర్వాత పొలిటికల్ పంచ్ డైలాగులతో మరింత సెగలు రేపుతున్నారు. ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు చెల్లవని, రౌడీలు రాజ్యాలు ఏలకూడదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమ నిర్బంధాలకు జనసేన వెరవదు అని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలు తెలుస్తాయనే భయంతోనే విశాఖలో జనవాణి కార్యక్రమం జరగకుండా అడ్డుకున్నారని విమర్శించారు. రాజమండ్రి పీఏసీ మీటింగ్ కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన పవన్ కల్యాణ్, మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విశాఖ నేతలతో సమావేశవయ్యారు.
ఏపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు ఎక్కు పెట్టారు. ఇటీవల బెయిల్ పై విడుదలైన జనసేన నేతల్ని పార్టీ ఆఫీస్ లో శాలువాలు కప్పి సన్మానం చేశారు పవన్ కల్యాణ్. వారి కుటుంబ సభ్యులతో సమావేశమై జనసేన అండగా ఉంటుందని చెప్పారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో తప్పెవరిది అనేది ఇంకా నిర్థారణ కాలేదు కానీ, మంత్రుల కాన్వాయ్ పై దాడిని ఎవరూ సమర్థించరు. పవన్ మాత్రం నిందితులుగా ఉన్నవారికి సన్మాన కార్యక్రమాలు పెట్టడం మాత్రం విశేషం!