Pawan Kalyan First Speech : అసెంబ్లీ లో తొలిస్పీచ్‌తోనే అదరగొట్టిన పవన్ కళ్యాణ్
గత ప్రభుత్వంలో వ్యక్తిగత దూషణలు చాలా ఇబ్బంది పెట్టాయని , భాష మనసులను కలపడానికి ఉండాలే తప్ప విడగొట్టడానికి కాదని అభిప్రాయపడ్డారు
- Author : Sudheer
Date : 22-06-2024 - 12:41 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalan) అసెంబ్లీ (Assembly) లో తొలి స్పీచ్ తోనే అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నాడు. అసెంబ్లీ గేటుకూడా తాకలేడు అని ఎద్దేవా చేసిన వైసీపీ నేతలకు అన్ని మూసుకునేలా చేసాడు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి..ఈరోజు అసెంబ్లీ లో ప్రతిపక్ష హోదా తో పాటు ఉప ముఖ్యమంత్రి , పలు శాఖల మంత్రిగా బాధ్యత చేపట్టాడు పవన్.
ఏపీ సమావేశాల్లో రెండో రోజు ఈరోజు ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu ) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా మొదటిసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ లో మాట్లాడారు. ముందుగా స్పీకర్ ను ఎన్నికైన అయ్యన్నను అభినందిస్తూ పవన్ మాట్లాడారు. తొలిస్పీచ్‌తోనే అదరగొట్టారు పవన్. సభ ఎలా ఉండాలో తన మనసులోని మాటలను తెలియజేశారు.
We’re now on WhatsApp. Click to Join.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్‌గా రావడం సంతోషంగా ఉందన్నారు పవన్ కల్యాణ్. ఓటమిని ధైర్యంగా స్వీకరించే దమ్ము వైసీపీకి లేదన్నారు. అందుకే సభ నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. ఇన్ని దశాబ్దాల్లో ప్రజల అయ్యన్న పాత్రుడిలో వాడీవేడి చూశారు ఇన్నాళ్లూ ఘాటైన వాగ్దాటి చూశారని అన్నారు. నేటి నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారని అయ్యన్నను ఉద్దేశించి కామెంట్ చేశారు.
గత ప్రభుత్వంలో వ్యక్తిగత దూషణలు చాలా ఇబ్బంది పెట్టాయని , భాష మనసులను కలపడానికి ఉండాలే తప్ప విడగొట్టడానికి కాదని అభిప్రాయపడ్డారు. భాష విద్వేషం రేపడానికి కాదని గుర్తు చేశారు. సమస్యలు పరిష్కరించడానికి అని అన్నారు. ఎంత జఠిల సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని వివరించారు. గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసిందని అన్నారు పవన్. ఇకపై సభలో వేసే ప్రతి అడుగు భవిష్యత్తు తరతరాలకు ఆదర్శంగా నిలవాలని అందుకే స్పీకర్ కీలక పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు.
2047 నాటికి ఏపీ ఉన్నతంగా వుండాలి అంటే ఇప్పుడే దానికి పునాది వెయ్యాలి. విభేదించడం, వాదించడం చర్చకు మూల సిద్ధాంతాలు. అంతేగాని, దూషణలు, కొట్లాటలు కాదు. పొట్టి శ్రీరాములు చావుకు దగ్గర అవుతూ చేసిన ఒక్కో రోజు దీక్ష ఒకటిన్నర ఏళ్లుకు సమానం. మహానుభావుడు, బ్రతికినప్పుడే కాదు చనిపోయినప్పుడు కూడా అయన గుర్తుండాలి. ఈ విలువైన ఐదేళ్లు రాబోయే తరాలకు దిశా నిర్దేశం చేసేలా వుండాలి. పశువు, పక్షి, చెట్టు అన్నీ కూడా బావుండాలి అని కోరుకుంటూన్నాను.’ అని పవన్ ఆకాంక్షించారు.
Read Also : Pawan Kalyan : ‘ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో’ తెలిసిన వ్యక్తి పవన్ – సీఎం చంద్రబాబు