Pawan Kalyan : ‘ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో’ తెలిసిన వ్యక్తి పవన్ – సీఎం చంద్రబాబు
ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అని ప్రశంసల జల్లు కురిపించారు
- By Sudheer Published Date - 12:28 PM, Sat - 22 June 24

ఏపీ సమావేశాల్లో (AP Assembly) రెండో రోజు ఈరోజు ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu ) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉదయం పదిన్నర గంటలకు సభ సమావేశంకాగానే తొలి రోజు మిగిలిపోయిన సభ్యుల ప్రమాణ స్వీకారం చేసారు. అనంతరం.. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పీకర్ ఎన్నిక ప్రక్రియ మొదలుపెట్టారు. ఏపీ శాసనసభాపతిగా అయ్యన్న పాత్రుడ్ని ఏకగ్రీవంగా (speaker of AP) ఎన్నుకున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్, మంత్రి సత్యకుమార్ ఆయన్ని సభాపతి స్థానంలో కూర్చోబెట్టి ఆల్‌ది బెస్ట్ చెప్పారు.
ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు (CHandrababu) మాట్లాడుతూ.. అయన్నపాత్రుడు ముక్కుసూటిగా మాట్లాడతారు. కచ్చితత్త్వానికి పెట్టింది పేరు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయన సొంతం. రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని నేటి వరకూ ఆయన వీడలేదు. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో మంది సీనియర్లు పక్క చూపులు చూసినా ఆయన పార్టీకి అండగా ఉన్నారు. పార్టీ శ్రేణుల స్థైర్యం దెబ్బతినకుండా ధైర్యవచనాలు చెప్పారు. పార్టీ కోసం అంత నిబద్ధత చూపినందుకే నేడు స్పీకర్ పదవి ఆయన్నివరించిందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
వైసీపీ పాలనలో ఎంతోమంది మహిళలు బాధపడ్డారని, గౌరవసభగా శాసనసభను నడిపిస్తానని ప్రజలకు మాట ఇచ్చానని, రాష్ట్రంలో ఆడబిడ్డలకు వైసీపీ పాలనలో జరిగిన అవమానం ఇంకెప్పుడూ ఈ సభలో జరగకూడదని చంద్రబాబు అన్నారు. తనకు మరో జన్మంటూ ఉంటే తెలుగువాడిగా పుట్టాలని కోరుకుంటున్నానని అన్నారు. గత కౌరవ సభలో తాను ఉండబోనని, సీఎంగానే సభలో అడుగుపెడతానని చెప్పానని గుర్తుచేశారు. తన కుటుంబ సభ్యులపై వైసీపీ సభ్యులు అమర్యాదగా మాట్లాడారని చంద్రబాబు గుర్తుచేశారు.
ఆలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అని ప్రశంసల జల్లు కురిపించారు. పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు తాకనీయబోమన్నారని, కానీ పవన్ పోటీ చేసిన 21 చోట్ల గెలిచారని చంద్రబాబు అన్నారు.
Read Also : Govt Employees : ఆలస్యంగా ఆఫీస్ కు వస్తాం అంటే కుదరదు..ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం వార్నింగ్