Pawan Kalyan: వైరల్ జ్వరంతో బాధపడుతున్న పవన్ కల్యాణ్ — వైద్యుల సూచనలతో విశ్రాంతి
వైద్యులు నిర్వహించిన పరీక్షల అనంతరం పవన్‌కు విశ్రాంతి అవసరమని సూచించారు.
- By Dinesh Akula Published Date - 10:50 PM, Tue - 23 September 25
అమరావతి, సెప్టెంబరు 23: (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. గత రెండు రోజులుగా జ్వరంతో ఇబ్బందిపడుతున్న ఆయన, ఆరోగ్య పరిస్థితిలో భాగంగా సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలు, అధికారులతో సమీక్షల్లో జ్వరంతోనే పాల్గొన్నారు.
వైద్యులు నిర్వహించిన పరీక్షల అనంతరం పవన్‌కు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో ఆయన ప్రస్తుతం ప్రత్యక్ష కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిపాలనా పనులు కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టులు పెడుతున్నారు. పవన్ ఆరోగ్యం త్వరగా మెరుగవ్వాలని ఆకాంక్షిస్తున్నారు.