HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Counters Ysrcp During Social Media Interview

PK: నేను ప్రజలకు మాత్రమే దత్తపుత్రుణ్ణి!

జనసేన సోషల్ మీడియా విభాగం ఇంటర్వ్యూలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్

  • Author : Hashtag U Date : 09-02-2022 - 11:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
pawan kalyan
pawan kalyan

జనసేన సోషల్ మీడియా విభాగం ఇంటర్వ్యూలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్:

ప్రశ్న: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు నోటీసులు ఇవ్వడం, భారీ నిరసన ప్రదర్శన నిర్వహించడం చూశాం. రాజీ జరిగిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో ముఖ్యంగా మిమ్మల్ని ఉద్దేశిస్తూ దత్తపుత్రుడు అనే మాటను ప్రయోగించారు. దీనిపై మీరేమంటారు?

జవాబు: వైసీపీ నాయకత్వానికి నేను ఒక్కటే తెలియజేస్తున్నాను… నేను ప్రజలకు మాత్రమే దత్తపుత్రుడుని. వైసీపీ నాయకులు, సలహాదారులు, గౌరవ పెద్దలు మాట్లాడిన మాటలు, చేసిన కామెంట్లు నా దృష్టికి వచ్చాయి. ఉద్యోగుల సమస్యను విపక్షాలు సృష్టించింది కాదు. ఎన్నికల సమయంలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తాం, జీతాలు పెంచుతామని ఉద్యోగులకు ఆశలు కల్పించింది మీరు. వాళ్లకు రావాల్సింది, పే రివిజన్ కమిషన్ సూచించిందే అమలు చేయమని అడుగుతున్నారు. అమలులో చాలా ఆలస్యమైంది. దీని కోసం చాలా సమావేశాలు నిర్వహించారు. మంత్రులు కూర్చున్నా తెగలేదు. ఉద్యోగులకు కోపం వచ్చి లక్షలాదిగా రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వం మీద నిరసన తెలిపితే దానికి జనసేనను, మిగతా పార్టీలను విపక్షాలను విమర్శించడం సమర్థవంతమైన చర్య కాదు. వైసీపీ నాయకులు, ప్రభుత్వ ధోరణి ఎలా ఉందంటే వాళ్లను ఎవరూ ఏమీ అనకూడదు. వాళ్లు ఏం చేసిన డూడూ బసవన్నలా తల ఊపేసి ముందుకెళ్లిపోవాలి. అలా కాదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దగ్గర నుంచి ఈ రోజు నల్ల బ్యాడ్జీలతో కట్టుకొని విధులకు హాజరవుతున్న టీచర్ల వరకు అందరినీ శత్రువులుగానే చూస్తారు.

వెటకారాలు ఆపి పని చూడండి

మేము డూడూ బసవన్న పని చేయలేం. న్యాయంగా వాళ్లకు దక్కాల్సిన హక్కు గురించే అడుగుతున్నారు. చేయాల్సింది చేస్తే వాళ్లెందుకు రోడ్లు మీదకు వస్తారు. మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ రెచ్చగొట్టేలా మాట్లాడుతారు. ఈ రోజు టీచర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారంటే అది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. ఇచ్చిన మాట మీద నిలబడకుండా వెటకారాలు చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ముందు వెటకారాలు ఆపి పని చూడండి. అదొక్కటే మేము కోరుకునేది.

ఉద్యోగులను రెచ్చగొట్టేలా మాట్లాడారు

ప్రశ్న: ఉద్యోగుల పి.ఆర్.సి. విషయంలో ప్రభుత్వం ఆధిపత్య ధోరణితో ముందుకు వెళ్లిందన్న మీ వ్యాఖ్యలపై సలహాదారు సజ్జల కామెంట్ చేశారు. మీ స్పందన ఏమిటి?
జవాబు: నా కామెంట్స్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల గారికి ఇబ్బంది కలిగించాయని మాట్లాడుతున్నారు. ఆధిపత్య ధోరణి అనే పదాన్ని పదేపదే ప్రస్తావిస్తూ ఇబ్బంది పడుతున్నారు. ఆధిపత్య ధోరణి అంటే హై-హ్యాండెడ్ నెస్ అని నా ఉద్దేశం. ఆధిపత్య ధోరణి అనే పదాన్ని ఎందుకు అన్నానంటే… సమస్య వచ్చి రోడ్ల మీదకు వచ్చిన ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తామని రకరకాల మాధ్యమాల ద్వారా ప్రచారం చేయించడం, మీ మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడం చూసి ప్రభుత్వం హై-హ్యాండెడ్ గా బిహేవ్ చేసింది అన్నాను. మీరు మాట్లాడిన మాటలు సంతృప్తికరంగా లేవని మాట్లాడాను. దానిని వక్రీకరించొద్దని పెద్దలు సజ్జల గారికి నా విన్నపం. ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణం. లక్షలాది మంది రోడ్ల మీదకు వచ్చారంటే విపక్షాలు చెబితే వచ్చింది కాదు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ, కమ్యూనిస్టులు చెబితే వచ్చిన వారు కాదు. మీరొక విధానం ప్రకటించాక.. మీరిచ్చింది వారికి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వాళ్ళు రోడ్లు మీదకు వచ్చారు. బాధ్యతగల రాజకీయ పార్టీగా వారికి మద్దతుగా మాట్లాడటం మా బాధ్యత. మేమెందుకు ఉద్యోగులను రెచ్చగొడతాం. ఒక విధానం ప్రకటించి, జీతాలు పెంచుతామని ఆశలు చూపించి, ఈ రోజు పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదని లక్షలాది మంది రోడ్ల మీదకు వస్తే వాళ్లకు మద్దతుగా మాట్లాడవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం విఫలమవ్వాలని ఏ ఒక్కరు కోరుకోరు. మరింత సమర్ధవంతంగా పనిచేయాలనే అందరం కోరుకుంటాం. మీరు ఆధిపత్య ధోరణి ఆధిపత్య ధోరణి అని మాట్లాడాం అంటున్నారు… లక్షలాది మంది ఉద్యోగులు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపిన తరువాత మీ అగ్రనాయకత్వం వచ్చి ఎంతో ప్రేమగా పలకరించి హత్తుకున్నారు. అదేదో ముందే చేస్తే ఈ గొడవ ఉండేదే కాదు కదా. అలా చేసి ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం వచ్చేదే కాదు కదా. అది దృష్టిలో పెట్టుకోండి దయచేసి నా మాటలను తప్పుదోవ పట్టించొద్దని సజ్జల గారికి నా విన్నపం.

తెలంగాణ యాత్రలో భాగంగా పార్టీ నేతలు, శ్రేణులతో సమావేశాలు:

ప్రశ్న: తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, శ్రేయస్సు కాంక్షిస్తూ యాత్ర చేయాలని అనుకుంటున్నారని తెలిసింది. ఆ యాత్ర వివరాలు ఏమిటి? ఎలా ఉండబోతుంది?

జవాబు: దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అభివృద్ధి, వారి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ‘అనుష్టుప్ నారసింహ దర్శన యాత్ర’ సంకల్పించాను. మా ఇంటి ఇలవేల్పు, ఆరాధ్యదైవం, నన్ను విద్యుత్ ప్రమాదం నుంచి కాపాడి, నాకు పునర్జన్మనిచ్చిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని ముందుగా దర్శించుకొని, అనంతరం ధర్మపురి నారసింహుని క్షేత్రం, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాంపల్లి గుట్ట నారసింహుని క్షేత్రాన్ని దర్శించుకుంటాను. మిగతా 30 నారసింహ క్షేత్రాలను దశలవారీగా దర్శించి ప్రజలను చల్లగా చూడాలని స్వామి దీవెనలు కోరుకోవడానికి ఈ యాత్ర సంకల్పించాను. తెలంగాణలోని క్షేత్రాల పర్యటనలో భాగంగా అక్కడి నాయకులు, జన సైనికులతో కూడా పరిమితమైన సమావేశాలు చేయాలని నిర్ణయించాం. అలాగే మార్చి 14న ఆవిర్భావ దినోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh government
  • AP government employees
  • Jana Sena Chief
  • jana sena social media
  • Pawan Kalyan
  • ysrcp

Related News

Pawan Kalyan

Pawan Kalyan : ఢిల్లీ హైకోర్టులో పవన్ కళ్యాణ్ పిటిషన్

Pawan Kalyan : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా AI వీడియోలను సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు

  • Ap Cabinet Meeting Dec 11

    AP Cabinet Decisions : ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు

  • Chandrababu

    CBN : ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం – సీఎం చంద్రబాబు

  • Dekhlenge Saala

    Dekhlenge Saala: పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్.. ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది!

  • New ration card applicants need not worry: Minister Nadendla Manohar

    Pawan Kalyan : పవన్ ‘దిష్టి’ వ్యాఖ్యలపై మంత్రి మనోహర్ వివరణ

Latest News

  • Vizag : వైజాగ్ లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన కంపెనీల వివరాలు

  • Divi Vadthya Bikini : బికినీ లో ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేసిన దివి

  • Greenfield Highway Works : తెలంగాణలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు ప్రారంభం

  • Telangana- ASEAN Partnership: తెలంగాణ లో పెట్టుబడులు పెట్టాలంటూ ASEAN కంపెనీలను ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్

  • New Features in Whatsapp : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు

Trending News

    • Akhanda 2 Roars At The Box Office : బాలయ్య కెరీర్లోనే అఖండ 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.. శివ తాండవమే..!

    • Akhanda 2 Review : బాలయ్య అఖండ 2 మూవీ రివ్యూ!

    • Sarpanch Salary: తెలంగాణలో సర్పంచుల వేతనం ఎంతో తెలుసా?!

    • Indigo Flight: ఇండిగో ప్రయాణికులకు రూ. 10,000 ట్రావెల్ వోచర్!!

    • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి కారణం ఏమిటి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd