Ratan Naval Tata : రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు – పవన్ కళ్యాణ్
Pawan Kalyan : టాటా మరణంపై స్పందించారు. రతన్ టాటా వ్యాపారవేత్త మాత్రమే కాదని, నిజమైన మానవతావాదిని కోల్పోయామని
- Author : Sudheer
Date : 10-10-2024 - 3:52 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (Ratan Naval Tata ) (86) కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో గత అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రతన్ టాటా మరణ వార్త తెలిసి అన్ని రంగాలవారు నివాళ్లు అర్పిస్తూ..ఆయన విజయాలు , ఆయన చేసిన సేవ , సహాయాలు గురించి మాట్లాడుకుంటూ గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయ నేతలు , బిజినెస్ వర్గీయులు తమ సంతాపాన్ని తెలియజేయగా..సినీ ప్రముఖులు సైతం పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా నివాళ్లు అర్పిస్తున్నారు.
ఈ క్రమంలో సినీ నటుడు , జనసేన అధినేత , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ..టాటా మరణంపై స్పందించారు. రతన్ టాటా వ్యాపారవేత్త మాత్రమే కాదని, నిజమైన మానవతావాదిని కోల్పోయామని , రతన్‌ను అభిమానించేవారికి, టాటా గ్రూప్‌నకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. మరోపక్క ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ముంబై చేరుకొని రతన్ టాటాకు నివాళి అర్పించారు. అంతకు ముందు ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది.
Read Also : Diwali: లక్ష్మీ అనుగ్రహం కావాలా.. అయితే దీపావళికి వారం ముందే ఇలా చేయండి!