Janasena Formation Day : నా తెలంగాణ కోటి రతనాల వీణ – పవన్ కళ్యాణ్
Janasena Formation Day : శాసనసభలో అడుగు పెట్టిన ఈ విజయాన్ని జనసేన కార్యకర్తల కృషికి అంకితమిస్తున్నానని, ప్రజల సమస్యల కోసం తమ పోరాటం ఇంకా కొనసాగుతుందని పవన్ స్పష్టం
- By Sudheer Published Date - 09:30 PM, Fri - 14 March 25

జనసేన ఆవిర్భావ దినోత్సవ (Janasena Formation Day) సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భావోద్వేగంగా స్పందించారు. జనసేన జన్మస్థలం తెలంగాణ, కర్మస్థలం ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన ఆయన, తన జీవితం మళ్లీ ప్రారంభం కావడానికి తెలంగాణ నేల కీలక భూమిక పోషించిందని గుర్తుచేశారు. కొండగట్టు అంజన్న ఆశీర్వాదం, తెలంగాణ ప్రజల ప్రేమ వల్లే తాను మరలా బతికి రాజకీయంగా ఎదిగానని అన్నారు. తెలంగాణ సంస్కృతి, పోరాట వైఖరి తనకు ప్రేరణగా నిలుస్తుందని, ప్రజా గాయకుడు గద్దర్ తనకు తమ్ముడిలా పలకరించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.
Janasena Formation Day : నాగబాబు చేసిన వ్యాఖ్యలు జగన్ కు ‘అస్త్రం’ గా మారాయి
అలాగే త్రిభాషా విధానం చుట్టూ వివాదం నడుస్తున్న వేళ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. జనసేన ఆవిర్భావ సభలో నాలుగు భాషల్లో మాట్లాడిన ఆయన “చాలా భాషలు అయిపోయాయ్ కదా?” అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. భిన్నమైన భాషలు పరస్పరం అర్థం చేసుకోవడానికి, ప్రేమను పంచుకోవడానికి ఉపయోగపడతాయని, దేశానికి బహుభాషా విధానం అవసరమని పవన్ అభిప్రాయపడ్డారు. భారతీయ భాషలన్నింటినీ సమానంగా చూడాలని, ప్రాంతీయతను కాకుండా సమగ్ర భారతీయతను కలిగిన దృక్పథం అవసరమని స్పష్టం చేశారు.
Honey Trap : పాక్ మహిళా మోజులో పడి భారత్ రహస్యాలు చెప్పిన వ్యక్తి అరెస్ట్
ఈ ఎన్నికల్లో జనసేనను అసెంబ్లీ గేటు దాటి ప్రవేశించలేమని చాలెంజ్ చేసిన వారికి గట్టి సమాధానం ఇచ్చామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. “మనల్ని చిన్నచూపు చూసిన వారిని తిప్పికొట్టాం. మనం నిలబడ్డాం.. పార్టీని నిలబెట్టాం. టీడీపీతో కలిసి భవిష్యత్‌ను దిశా నిర్దేశం చేస్తున్నాం” అని పవన్ కళ్యాణ్ అన్నారు. శాసనసభలో అడుగు పెట్టిన ఈ విజయాన్ని జనసేన కార్యకర్తల కృషికి అంకితమిస్తున్నానని, ప్రజల సమస్యల కోసం తమ పోరాటం ఇంకా కొనసాగుతుందని పవన్ స్పష్టం చేశారు. “జై జనసేన! జై జనసేన!” అంటూ ఆయన నినాదాలు చేశారు.