Pawan Kalyan : ఊరు మొత్తానికి చెప్పులు పంపిణీ చేసిన పవన్ కళ్యాణ్ ..ఎందుకంటే !!
Pawan Kalyan : గ్రామంలో మొత్తం 345 మంది గిరిజనులకు చెప్పులు లేవని తెలుసుకొని, వెంటనేవారికి అవసరమైన చెప్పుల సైజులపై సర్వే చేయించారు
- By Sudheer Published Date - 12:41 PM, Fri - 18 April 25

అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడు (Pedapadu ) గ్రామంలోని గిరిజనుల్లో (Tribals) సంతోషం నింపారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఇటీవల జరిగిన ‘అడవితల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆదివాసీ గ్రామాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఓ వృద్ధ గిరిజన మహిళ పాంగి మిత్తు, చెప్పులు (Slippers ) లేకుండా నడిచి వచ్చి పవన్‌కు స్వాగతం పలకడం ఆయనను ఎంతో ఆవేదనకు గురి చేసింది.
NCL Technician Recruitment: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. పది అర్హతతో ఉద్యోగాలు!
ఈ దృశ్యాన్ని చూసిన పవన్ కళ్యాణ్ వెంటనే గ్రామంలోని ప్రజల పరిస్థితిని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో మొత్తం 345 మంది గిరిజనులకు చెప్పులు లేవని తెలుసుకొని, వెంటనేవారికి అవసరమైన చెప్పుల సైజులపై సర్వే చేయించారు. వెంటనే తన కార్యాలయ సిబ్బందితో కలిసి వారందరికీ కొత్త చెప్పులు పంపించాలని ఆదేశించారు. దీనికి అనుగుణంగా గురువారం రోజున చెప్పులు పంపిణీ జరిగాయి.
ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది బోయిపల్లి పవన్, స్థానిక బృంద సభ్యులు, సర్పంచ్ వెంకటరావు కలిసి ప్రతి ఇంటికి వెళ్లి చెప్పులను అందజేశారు. ఈ సహాయానికి గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తూ, తమ సమస్యను గమనించి స్వయంగా స్పందించిన పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉదంతం ద్వారా పవన్ కళ్యాణ్ ప్రజల పట్ల తన మనస్ఫూర్తి సేవాభావాన్ని మరోసారి నిరూపించుకున్నారు.