Papi Kondalu Tour : పాపికొండల టూర్ మొదలైంది.. ఇలా బుక్ చేసుకోండి..
కొండలు, జలపాతాలు, రమణీయమైన ప్రకృతి నడుమ పాపికొండల పర్యటన ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. భద్రాచలం మీదుగా పాపికొండల వరకు పర్యటించే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా తెలిపారు.
- By Hashtag U Published Date - 10:18 AM, Sun - 19 December 21

కొండలు, జలపాతాలు, రమణీయమైన ప్రకృతి నడుమ పాపికొండల పర్యటన ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. భద్రాచలం మీదుగా పాపికొండల వరకు పర్యటించే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా తెలిపారు. ఈ నెల 24 వ తేదీ నుంచి పర్యటనను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. పెద్దలకు రూ.4,999, పిల్లలకు రూ.3,999గా ధరను నిర్ణయించారని తెలిపారు.
అయితే పాపి కొండల పర్యాటక ప్రాంతం చాలా రోజుల తర్వాత ప్రారంభం కావడం తో అక్కడి స్థానికులకు పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పర్యాటకులు లేక ఆదాయం తగ్గిపోయిన వారికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో వారి జీవితం లో కూడా వెలుగు వచ్చాయని చెప్పవచ్చు. అయితే పాపి కొండలలో పర్యాటకులు కరోనా నిబంధనలు తప్పక పాటించాలని కూడా అధికారులు సూచిస్తున్నారు.