HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Pa Murder Case Jana Sena Leader Vinuta Kota Arrested Expelled From The Party

Srikalahasti : పీఏ హత్య కేసు..జనసేన నేత వినుత కోటా అరెస్టు, వేటు వేసిన పార్టీ!

ఈ కేసు దర్యాప్తులో ఉన్న చెన్నై పోలీసులు వినుతతో పాటు ఆమె భర్త చంద్రబాబును అరెస్టు చేశారు. పార్టీకి తీవ్ర అపఖ్యాతి వచ్చే పరిస్థితుల్లో జనసేన నేతృత్వం ఆమెను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

  • By Latha Suma Published Date - 03:11 PM, Sat - 12 July 25
  • daily-hunt
PA murder case.. Jana Sena leader Vinuta Kota arrested, expelled from the party!
PA murder case.. Jana Sena leader Vinuta Kota arrested, expelled from the party!

Srikalahasti : శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇంచార్జిగా ఉన్న కోట వినుతపై తీవ్ర ఆరోపణలు వెలువడుతున్నాయి. ఆమె వ్యక్తిగత సహాయకుడు (పీఏ)గా, డ్రైవర్‌గా పనిచేసిన చెన్నైకి చెందిన సీహెచ్‌ శ్రీనివాసులు అలియాస్ రాయుడు ఇటీవల అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తులో ఉన్న చెన్నై పోలీసులు వినుతతో పాటు ఆమె భర్త చంద్రబాబును అరెస్టు చేశారు. పార్టీకి తీవ్ర అపఖ్యాతి వచ్చే పరిస్థితుల్లో జనసేన నేతృత్వం ఆమెను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. చెన్నైలోని ఓ మురికి కాలువలో గుర్తు తెలియని మృతదేహం దొరకడంతో మింట్ పోలీస్ స్టేషన్‌ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పరిశీలించగా, చేతిపై జనసేన గుర్తు టాటూ ఉండటంతో పోలీసులు ఆ దిశగా విచారణ జరిపారు. మృతుడు గతంలో కోట వినుతకు పీఏగా పనిచేసిన శ్రీనివాసులనే అని గుర్తించారు.

Read Also: Stag Beetle : ఈగ ఖరీదు రూ. 75 లక్షలు..! ఎందుకు అంత..? దాని ప్రత్యేకతలు ఏంటి..?

వద్ద బొక్కసంపాలెం గ్రామానికి చెందిన రాయుడు గతంలో వినుతకు పీఏగా, డ్రైవర్‌గా పని చేశారు. అయితే, గత నెలలో అకస్మాత్తుగా ఆయనను విధుల నుంచి తొలగించారు. ఆ వెంటనే వినుత తరపున పత్రికలో ప్రకటన ఇస్తూ, రాయుడుతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. సోషల్ మీడియాలోనూ ఇదే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ, ఈ ప్రకటనల కేవలం పదిహేను రోజుల్లోనే రాయుడు శవమై కనపడటంతో పోలీసులకు అనుమానం పెరిగింది. చెన్నై పోలీసులు ఈ హత్య కేసులో విచారణను వేగవంతం చేశారు. కోట వినుతతో పాటు ఆమె భర్త చంద్రబాబు, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ప్రకారం ఇది ముందే ప్రణాళికాబద్ధంగా జరిగిన హత్యగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన జనసేన పార్టీ, వినుతను తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించామని ప్రకటించింది. పార్టీకి చెందిన కాన్ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ హెడ్ వేముపాటి అజయ్ కుమార్ ఈ విషయమై ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

అందులో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న కోట వినుత వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా ఉన్నందున గత కొంత కాలంగా ఆమెను పార్టీ కార్యక్రమాలనుంచి దూరంగా ఉంచాం. ఇప్పుడు ఆమెపై హత్య కేసు నమోదైన నేపథ్యంలో ఆమెను జనసేన పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరిస్తున్నాం అని పేర్కొన్నారు. ఈ ఘటనతో పాటు మరెన్నో రాజకీయ నాయ‌కులపై వ్యక్తిగత స్థాయిలో ఆరోపణలు రావడం గమనార్హం. పార్టీ ప్రమాణాలకు భిన్నంగా వ్యవహరించే నేతలపై కఠిన చర్యలు తీసుకోవడమే జనసేన లక్ష్యమని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా, రాయుడు హత్య వెనుక మరెవ్వరైనా ఉన్నారా? ఇదేమైనా రాజకీయ కుట్రా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు కోట వినుతకు మద్దతుగా కొందరు కార్యకర్తలు ముందుకు రావడం కూడా పార్టీకి కొత్త చికాకులను తెచ్చిపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

Read Also: IIM Calcutta : కోల్‌కతాలో మరో ఘోరం.. హాస్టల్‌లో విద్యార్థినిపై అత్యాచారం

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ARREST
  • Chennai Police
  • Chittoor
  • Jana Sena leader Vinuta Kota
  • Srikalahasti

Related News

    Latest News

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd