Stag Beetle : ఈగ ఖరీదు రూ. 75 లక్షలు..! ఎందుకు అంత..? దాని ప్రత్యేకతలు ఏంటి..?
Stag Beetle : గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఈ కీటకం విలువ దాదాపు రూ.75 లక్షలు ఉంటుందని తెలిసిందట. ఒక్క ఈగను అమ్మితే రెండు లగ్జరీ కార్లు కొనుగోలు చేయొచ్చన్న విషయం నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
- By Sudheer Published Date - 03:06 PM, Sat - 12 July 25

సిక్కింలో ఇటీవల ఒక వ్యక్తికి కనిపించిన స్టాగ్ బీటిల్ (Stag Beetle) కీటకం గురించి అతడు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అతను ఈ అరుదైన పురుగును చూసిన సందర్భాన్ని వివరిస్తూ, మొదట ఇది సాధారణ కీటకమని అనుకున్నానని, కానీ స్థానికుడిని అడిగితే ఇది స్టాగ్ బీటిల్ అని తెలిసిందని తెలిపాడు. ఆ తరువాత గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఈ కీటకం విలువ దాదాపు రూ.75 లక్షలు ఉంటుందని తెలిసిందట. ఒక్క ఈగను అమ్మితే రెండు లగ్జరీ కార్లు కొనుగోలు చేయొచ్చన్న విషయం నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
స్టాగ్ బీటిల్‌కి అంత ధర ఎందుకంటే.. ఇది చాలా అరుదుగా మాత్రమే కనిపించే పురుగు. ప్రపంచంలో లభించే అత్యంత అరుదైన కీటకాలలో ఇది ఒకటి. అలాగే ఈ కీటకం ఇంట్లో ఉంటే అదృష్టం వస్తుందని నమ్మే సంప్రదాయం కూడా ఉంది. దాంతోపాటు, దీనిని ఔషధ తయారీలో వినియోగిస్తారు. వివిధ రకాల వ్యాధులకు మందుల తయారీలో ఉపయోగపడటంతో, స్టాగ్ బీటిల్‌కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అంతేకాదు, ఇది 7 సంవత్సరాల పాటు జీవించగలదు అన్నది ఈ కీటకం విశేషాల్లో ఒకటి.
Nipah Virus : కేరళ సరిహద్దుల్లో నిపా వ్యాధిపై అలర్ట్.. తమిళనాడు వైద్య శాఖ అప్రమత్తం
స్టాగ్ బీటిల్ కీటకం ప్రత్యేకతల్లో ఒకటి దాని శరీర నిర్మాణం. వీటి తలపై 5 అంగుళాల పొడవైన నల్లటి కొమ్ములు ఉంటాయి. నాలుక నారింజ రంగులో ఉంటుంది. మగ పురుగుల దవడలు పెద్దగా ఉంటే, ఆడ కీటకాల దవడలు మరింత బలంగా ఉంటాయి. ఈ కీటకాలు ముఖ్యంగా చెత్తలో ఉండి కుళ్లిన కలపను, చెట్టు రసాలను ఆహారంగా తీసుకుంటాయి. చలిని తట్టుకోలేక మృతి చెందే వీటి స్వభావం వల్ల శీతల ప్రాంతాల్లో ఎక్కువ కాలం జీవించలేవు.
ప్రస్తుతం స్టాగ్ బీటిల్‌కి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీటి ధర ఎంతగానో పెరిగినప్పటికీ, సరైన అనుమతులు లేకుండా వాటిని వేటాడటం లేదా అమ్మకం చేయడం చట్టరీత్యా నేరం కావచ్చు. అయితే ఈ వీడియో ద్వారా చాలా మంది ఈ కీటకం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఇదే ఒక్క ఈగ తమకూ దొరుకుతుందేమోనని ఆశలు పెట్టుకుంటున్నారు.