HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Orders To Close The Rajahmundry Bridge For A Month

Yuvagalam : యువ‌గ‌ళం ఎఫెక్ట్‌.. నెల రోజుల పాటు రాజ‌మండ్రి బ్రిడ్జి మూసివేత‌కు ఆదేశాలు జారీ

వ‌చ్చేవారం నుంచి టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పాద‌యాత్ర పునఃప్రారంభంకాబోతుంది. టీడీపీ అధినేత

  • Author : Prasad Date : 24-09-2023 - 10:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajahmundry
Rajahmundry

వ‌చ్చేవారం నుంచి టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పాద‌యాత్ర పునఃప్రారంభంకాబోతుంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ నేప‌థ్యంలో నారా లోకేష్ త‌న పాద‌యాత్ర‌ను నిలిపివేశారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు రిమాండ్‌లో ఉన్నారు. అయితే న్యాయ‌ప‌రంగా తీసుకోవాల్సిన చ‌ర్య‌లను నారా లోకేష్ ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఢిల్లీలో నారా లోకేష్ గ‌త వారం రోజులుగా మ‌కాం వేశారు. హైకోర్టులో చంద్ర‌బాబు వేసిన క్వాష్ పిటిష‌న్ కొట్టివేయ‌డంతో దానిని సుప్రీంకోర్టులో స‌వాల్ చేస్తున్నారు. రేపు దీనిపై సుప్రీం చీఫ్ జిస్టిస్ విచార‌ణ చేయ‌నున్నారు.అక్క‌డ కూడా క్వాష్ పిటిష‌న్ కొట్టివేస్తే వెంట‌నే బెయిల్ కి పిటిష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. బెయిల్ అయితే మ‌రో మూడు రోజుల్లో వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. దీంతో నారా లోకేష్ కూడా త‌న పాద‌యాత్ర‌ను ఎక్క‌డ అయితే ఆపారో అక్క‌డ నుంచే ప్రారంభించేందుకు స‌మాయ‌త్తం అవుతున్నారు. ఇదే విష‌యాన్ని టీడీపీ నేత‌ల టెలికాన్ఫ‌రెన్స్‌లో సీనియ‌ర్ నేత‌ల‌కు తెలిపారు.

లోకేష్ యువ‌గ‌ళం మ‌ళ్లీ ప్రారంభం అవుతుండ‌టంతో ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించ‌డం మొద‌లుపెట్టింది. రాజ‌మండ్రి బ్రిడ్జిని నెల రోజుల పాటూ మూసివేయాల‌ని జిల్లా యంత్రాంగం నిర్ణ‌యించింది. సెంట్రల్‌ క్యారేజ్‌వే, వయాడక్ట్‌ భాగం, రోడ్డు కమ్‌లోని అప్రోచ్‌లతోపాటు దెబ్బతిన్న సెకండరీ జాయింట్‌ల మరమ్మతుల నిమిత్తం ఈ నెల 27 నుంచి వ‌చ్చే నెల 26వ తేదీ వరకు రోడ్డు కం రైలు వంతెనపై నెల రోజుల పాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ కె.మాధవి లత తెలిపారు. ఈ అత్యవసర మరమ్మతుల కోసం ట్రాఫిక్‌ను మళ్లించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. క్యారేజ్‌వే పునరుద్ధరణకు దాదాపు 4.5 కిలోమీటర్ల మేర బి.టి. (బ్లాక్ టాప్ రోడ్) వయాడక్ట్ భాగం, అప్రోచ్‌లతో సహా, సెకండరీ జాయింట్‌ల వద్ద జియో-గ్లాస్ గ్రిడ్‌ల ప్రత్యేక మరమ్మత్తు పనులు రూ.210 లక్షలతో ప‌నులు చేప‌ట్ట‌నున్నారు. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఇట్రాఫిక్ మళ్లింపు ఉత్తర్వులను పోలీసు, రవాణా శాఖల అధికారులు పర్యవేక్షించాలని ఆమె తెలిపారు. APSRTC బస్సులను కూడా ప్రత్యామ్నాయ రూట్లలో నడపాలని ఆదేశించారు. పాఠశాల బస్సుల ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం వంతెనను మూసివేసిన విషయాన్ని జిల్లాలోని విద్యాసంస్థలకు తెలియజేయాలని డీఈవోను ఆదేశించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP CM
  • nara lokesh
  • Rajahmundry Bridge
  • Rajamundry bridge
  • yuvagalam

Related News

South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌తో భేటీ అయ్యారు. క్రీడల్లో తన అభిరుచి, క్రమశిక్షణ, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాల క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన జాంటీ రోడ్స్‌ను కలవడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ భేటీలో క్రీడలు, యువత అభివృద్ధ

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

  • MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

    TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

  • Village development in AP: Centre allocates Rs 16,627 crore.

    ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

Latest News

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd