HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Officials Seek Over Rs 2000 Cr From Cm For Housing Schemes

Amaravati: హౌసింగ్ స్కీమ్‌ల కోసం రూ. 2,000 కోట్లు..!

భారత ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు PMAY-U కింద రూ. 4,032 కోట్లు విడుదల చేసింది.

  • Author : Gopi Date : 27-10-2022 - 1:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Jagan
Cm Jagan

రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించేందుకు తక్షణమే రూ.2,361 కోట్లు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గృహనిర్మాణ శాఖ విజ్ఞప్తి చేసింది. భారత ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు PMAY-U కింద రూ. 4,032 కోట్లు విడుదల చేసింది. అయితే AP ప్రభుత్వం గృహనిర్మాణ శాఖకు గ్రాంట్‌లో రూ. 2,556 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మరో రూ. 1,476 కోట్లను దారి మళ్లించింది.

అంతేకాకుండా, దాని దామాషా వాటా రూ. 1,389 కోట్లలో రాష్ట్రం ఇప్పటివరకు రూ. 504 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అయితే “వనరుల కొరత” కారణంగా మిగిలిన మొత్తాన్ని నిలిపివేసినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. లబ్ధిదారులకు రూ.324 కోట్లు సహా రూ.755 కోట్ల చెల్లింపు పెండింగ్‌లో ఉండటంతో పథకం పురోగతికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. గత కొన్నేళ్లుగా.. పీఎంఏవై-యూ కింద ఏపీకి కేంద్రం 16,84,502 ఇళ్లను మంజూరు చేయగా.. ఇప్పటివరకు 13,92,855 ఇళ్లను మాత్రమే నిర్మించినట్లు ఆ అధికారి తెలిపారు. ఈ ఏడాది మొత్తం PMAY-U గ్రాంట్‌లో 57 శాతానికి పైగా డ్రా చేస్తూ దేశంలో అగ్రస్థానంలో ఉన్న AP మొత్తం రూ. 5,000 కోట్లు పొందవచ్చని అంచనా వేస్తోంది.

డిసెంబరులో కేంద్రం నుంచి వచ్చే విడత రావాలంటే మిగిలిన కేంద్ర వాటా రూ.1,476 కోట్లు, రాష్ట్ర వాటా రూ.885 కోట్లు వెంటనే విడుదల చేయాలని బుధవారం ఇక్కడ జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో గృహనిర్మాణ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పీఎంఏవై-యూ లబ్ధిదారులకు రూ.324 కోట్లు, భూసేకరణ, ల్యాండ్ లెవలింగ్ పనులకు మరో రూ.311 కోట్లు చెల్లించాల్సి ఉందని గృహనిర్మాణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన తాగునీటి సరఫరా పనులకు రూ.120 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇదిలావుండగా.. వివిధ కారణాల వల్ల గత కొన్ని నెలలుగా గృహనిర్మాణ కార్యక్రమం పురోగతి చాలావరకు ప్రభావితమైందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. దాదాపు ఐదు లక్షల ఇళ్లను పూర్తి చేసిన సందర్భంగా డిసెంబర్ 21న భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra CM Jagan Reddy
  • andhra pradesh
  • funds
  • housing scheme

Related News

CM Chandrababu Naidu

CM Chandrababu: ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఎల్లుండి (ఈ నెల 11న) ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక జలవివాదాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నారు. ముఖ్యంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షిం

  • Rayalaseema is now 'Royal' Seema... Chandrababu's intriguing tweet!

    CBN: రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్!

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    Chandrababu: 7వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

  • Nara Lokesh

    Nara Lokesh: లోకేశ్ ఆసక్తికర ట్వీట్..

  • Ex Union Minister Maneka Gandhi Letter to Chandrababu Naidu

    చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ.. గంగమ్మ జాతరలో జంతు బలులు ఆపండి

Latest News

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

  • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

  • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd