Chandrababu : ఏపీకి నంబర్ వన్ బ్రాండ్ తీసుకొచ్చి చూపిస్తా – సీఎం చంద్రబాబు
Seaplane : విధ్వంసమైన వ్యవస్థను గాడిలో పెడుతున్నామని, తమ ప్రభుత్వంలో ఏపీకి మళ్లీ నంబర్ వన్ బ్రాండ్ తీసుకువస్తామని హామీ ఇచ్చారు
- By Sudheer Published Date - 02:51 PM, Sat - 9 November 24

ఏపీ(AP)కి నంబర్ వన్ బ్రాండ్ (No 1 Brand) తీసుకొచ్చి చూపిస్తా..విజయవాడను హైదరాబాద్ కు దీటుగా అభివృద్ధి చేస్తా..20 ఏళ్ల క్రితమే ఐటీని అభివృద్ధి చేశా..ఇప్పుడు ఏపీని దేశంలోనే నెం 1 రాష్ట్రంగా అభివృద్ధి చేసి ప్రజల పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతా అన్నారు సీఎం చంద్రబాబు (Chandrababu). దేశంలో తొలిసారి పర్యాటకంగా సీ ప్లేన్ వినియోగాన్ని (seaplane trial run flight) అందుబాటులోకి తీసుకొచ్చారు చంద్రబాబు. ఈరోజు సీ ప్లేన్ తొలి ప్రయాణాన్నిలాంఛనంగా ప్రారంభించారు. సీ ప్లేన్లో విజయవాడ నుంచి శ్రీశైలానికి (Vijayawada to Srisailam) వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సివిల్ ఏవియేషన్ ను రామ్మోహన్ నాయుడు అద్భుతంగా నడిపిస్తున్నారని , భవిష్యత్ అంతా టూరిజందే అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎంతో సంక్షోభంలో ఉందని, అప్పుడు ప్రజలు ఎటువంటి సహాయం అందించారో గుర్తు చేశారు. ప్రజల సహకారం, సంక్షమ పరిస్థితుల్లో వారికి ఉత్పత్తి కల్పించే సామర్థ్యాన్ని చెప్పినట్లైంది. విధ్వంసమైన వ్యవస్థను గాడిలో పెడుతున్నామని, తమ ప్రభుత్వంలో ఏపీకి మళ్లీ నంబర్ వన్ బ్రాండ్ తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజలు గెలిచారని, రాష్ట్రాన్ని నిలబెట్టారని అన్నారు. ప్రభుత్వ విధానాలు చాలా ముఖ్యమని, ప్రభుత్వం నిర్ణయాల వల్ల భావి తరాలకు భవిష్యత్ ఉంటుందన్నారు.
అమెరికాలో పర్ కాపిటాలో కూడా భారతీయులే ముందున్నారని అన్నారు. ఏపీ నుండి వెళ్లినవాళ్లు లక్షా ఇరవై వేలు సంపాదిస్తున్నారని అన్నారు. అమెరికాలో ఉన్నా విజయవాడలో ఉన్నా ఆదాయం పెంచేందుకు ప్రయత్నించాన్నారు. ఏపీలో పుట్టిన వాళ్లు ఇక్కడ రాణించరు కానీ పక్క రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో రాణిస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను 20 ఏళ్ల క్రితమే ఐటీ గురించి ప్రస్తావిస్తే ఐటీ తిండి పెడుతుందా అని ఎద్దేవా చేశారని అన్నారు. కానీ ఆ రోజు వేసిన ఫౌండేషన్ వల్లనే తెలుగు వాళ్లు అమెరికాలో ఐటీలో పనిచేస్తున్నారని గుర్తుచేశారు. విజయవాడను హైదరాబాద్ కు దీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. మోడీ కూడా సీప్లేన్ లు ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చారన్నారు. సీప్లేన్ లకు ఎయిర్ పోర్టు కూడా అవసరం లేదని పేర్కొన్నారు.
Read Also : Jharkhand : రాష్ట్రంలో చొరబాటుదారులను అరికట్టడం బీజేపీతోనే సాధ్యం: అమిత్ షా